Begin typing your search above and press return to search.

మ‌ణిర‌త్నం మల్టీస్టార‌ర్ లో అనుష్క‌

By:  Tupaki Desk   |   28 May 2019 3:14 PM GMT
మ‌ణిర‌త్నం మల్టీస్టార‌ర్ లో అనుష్క‌
X
స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిరత్నం ఓ సినిమా తీస్తున్నారు అంటే భారీ కాన్వాసు ఉన్న‌దే అయి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. గ‌త నాలుగేళ్లుగా మ‌ణిర‌త్నం ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ విష‌య‌మై తర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌లుస్తుంది! అన్న చందంగా ఈ సినిమాకి స్టార్ల ఎంపిక ఎటూ తేలడం లేదు. ఎట్ట‌కేల‌కు బిగ్ స్టార్స్ తో ఓకే అనిపించుకున్న మ‌ణిర‌త్నం ఇక ఈ ఏడాది చివ‌రి నాటికి సెట్స్ పైకి వెళ్లేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

చోళ సామ్రాజ్య చ‌క్ర‌వ‌ర్తి అరుల్మోజి వ‌ర్మ‌న్ జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. `పొన్నియ‌న్ సెల్వన్` అనేది సినిమా టైటిల్. ఈ మూవీ క‌థాంశం కీ.శ‌.10వ శ‌తాబ్ధంలో సాగుతుంది. ఈ చిత్రంలో విక్ర‌మ్, శింబు, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అమ‌లాపాల్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించ‌నుంది. అలాగే మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ విల‌న్ గా న‌టిస్తుంద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. చోళ సామ్రాజ్యాన్ని ఎలా అయినా హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌నుకునే కోరిక‌తో ర‌గిలిపోయే విల‌న్ పాత్ర‌లో ఐష్ న‌టించ‌నుంది. చోళ చ‌క్ర‌వ‌ర్తి.. ట్రెజ‌ర‌ర్ పెరియ ప‌జు వెట్టారియ‌ర్ కి భార్య‌గా.. అత‌డిని త‌ప్పు దారి ప‌ట్టించి చోళుల‌పై తిరుగుబాటు చేయించే విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌ని ప్రాచార‌మైంది. ఇటీవ‌ల కేన్స్ ఉత్స‌వాల్లోనూ మ‌ణి తో ఛాన్స్ వ‌దులుకోన‌ని ఐష్ ప్ర‌క‌టించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ భారీ ప్రాజెక్టులో స్వీటీ అలియాస్ అనుష్క శెట్టి జాయిన్ అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం అనుష్క శెట్టిని సంప్ర‌దించార‌ట‌. తాను ఓకే చెప్పేసినా ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేద‌ని ఓ సోర్స్ రివీల్ చేస్తోంది. అనుష్క ఇప్ప‌టికే సైలెన్స్ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్ కి ఓకే చెబితే ఐష్‌-అనుష్క జోడీ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించే వీలుంటుందేమో!