Begin typing your search above and press return to search.
మణిరత్నం బిగ్గెస్ట్ మూవీ.. క్రేజీ అప్డేట్!
By: Tupaki Desk | 18 Jun 2021 8:00 AM IST''నా వయసు పెరుగుతుండొచ్చు.. కానీ నా మనసు మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది'' అంటారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఎన్నో ప్రేమ కావ్యాలు, మరెన్నో క్లాసిక్ లు తీసిన ఆయన.. ఇప్పటికీ ప్రేమ చిత్రాలను మాత్రం వదిలి పెట్టలేదు. సందర్భం కుదిరిన ప్రతిసారీ.. ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రచించిన నాలుగు నవలల సంకలనమే పొన్నియన్ సెల్వన్'. ఈ నవల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కారణం.. ఎంతో మంది ప్రముఖ హీరోలు, హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదలు, చియాన్ విక్రమ్, మోహన్ బాబు, విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాయ్, నయనతార, త్రిష, కీర్తి సురేష్ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
వాస్తవానికి ఎప్పడో పూర్తి కావాల్సిన ఈ సినిమాకు కరోనా అడ్డు పడింది. ఈ చిత్రానికి సంబంధించిన షూట్ చాలా భాగం విదేశాల్లో నిర్వహించాల్సి ఉంది. థాయ్ లాండ్, సింగపూర్, కేరళ వంటి ప్రాంతాల్లో షూట్ చేయాల్సి ఉందట. కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండడంతో ఫారెట్ టూర్ వేసేందుకు సిద్ధమవుతోంది యూనిట్.
ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు నెలలు షూట్ చేయాల్సి ఉందట. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.