Begin typing your search above and press return to search.

#6ప్యాక్ క్ల‌బ్.. నిఖిల్ తోనే పోటీనా అమ్మ‌డూ?

By:  Tupaki Desk   |   22 Dec 2020 12:30 PM IST
#6ప్యాక్ క్ల‌బ్.. నిఖిల్ తోనే పోటీనా అమ్మ‌డూ?
X
అవును .. 6 ప్యాక్ క్ల‌బ్ లో యువ‌హీరోల గురించి ఇంత‌కుముందే ప్ర‌స్థావించాం. లేటెస్టుగా యువ‌హీరో నిఖిల్ కూడా 6 ప్యాక్ క్ల‌బ్ లో చేరాడు. హీరోల ప్యాకింగులు రొటీనే కానీ.. హీరోయిన్లు 6 ప్యాక్ ల‌తో అద‌ర‌గొట్టేయ‌డం అన్న‌ది లేటెస్ట్ ట్రెండ్.

హాలీవుడ్ లోనే ఇది సాధ్యం అనుకుంటే పొర‌పాటే. ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ లోనూ ఇది సాధ్య‌మే. ఉత్త‌రాది భామ‌లు దిశా ప‌టానీ.. సోఫీ చౌంద‌రి.. మ‌లైకా అరోరా లు ఎప్పుడో 6 ప్యాక్ క్ల‌బ్ లో చేరారు. నిరంత‌రం యోగా జిమ్ తో ఈ భామ‌లు ఆ లెవ‌ల్ ని అందుకున్నారు. వీరంతా ద‌క్షిణాది భామ‌ల్ని ప్ర‌భావితం చేస్తున్నారు. నేటి త‌రం అంతా జిమ్మాయ‌న‌మ‌హః అంటూ ఎల‌క్ట్రానిక్ జిమ్ ల‌కు అంకిత‌మైపోతున్నారంటే అర్థం చేసుకోవాలి.

ఇప్పుడు `సాహో` లేడీ విల‌న్ మందిర భేడీ కూడా అదే క్ల‌బ్ లో చేరారు. ఈ భామ ప‌ర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీతో మ‌తులు చెడ‌గొడుతున్న తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లిగా మందిర అభిమానుల‌కు సుప‌రిచితం. అయినా విల‌న్ గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా టీవీ హోస్ట్ గా తీరిక లేకుండా కెరీర్ జ‌ర్నీ సాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు 6ప్యాక్ తో మెరుపులు మెరిపించేస్తోంది. ఇదిగో ఇలా బికినీ బీచ్ లో గోల్డ్ బికినీలో ప్ర‌త్య‌క్ష‌మై ఎలా కండ‌లు ప్ర‌ద‌ర్శిస్తోందో చూశారుగా.. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ ఆయిలీ స్కిన్ తో ప్యాకింగుల‌తో క‌నిపిస్తోంది బాడీ. ఇలా ప్రిపేర‌వ్వ‌డం అంటే ఆషామాషీ కాదు. నిరంత‌రం జిమ్ లో గంట‌ల త‌ర‌బ‌డి క‌స‌ర‌త్తులు చేయాలి. ఇందులో మందిర ఏమాత్రం త‌గ్గ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. నిజానికి నిఖిల్ లాంటి యువ‌హీరోల కంటే జిమ్మింగ్ లో చాలా సీనియ‌ర్ మందిర అని ఈ ప‌ర్ఫెక్ట్ ఫిట్ బాడీ చూశాక అంగీక‌రించాల్సిందే.