Begin typing your search above and press return to search.
వీడియో: మంచు విష్ణు అండ్ ఫైట్ మాస్టర్స్
By: Tupaki Desk | 30 April 2020 12:45 PM ISTలాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు దాదాపుగా అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొందరు అవేర్ నెస్ వీడియోలు పెడుతూ ఉంటే కొందరేమో ఆసక్తికరమైన ఛాలెంజిలలో పాల్గొంటున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చారు. పాస్ ది బ్రష్ ఛాలెంజ్ తరహాలో ఉండే వీడియో ఇది.
ఈ వీడియోలో విష్ణు తో పాటుగా దాదాపు పదిమంది ఫైట్ మాస్టర్లు పాల్గొనడం విశేషం. మొదట విష్ణు జిమ్ లో 'లెట్స్ డూ సంథింగ్ క్రేజీ' అంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఐడియా వస్తుంది.. వెంటనే చేయాలని పంచ్ ఇస్తాడు. ఆ పంచ్ తో విజయన్ మాస్టర్ కు దెబ్బ తగులుతుంది. వెంటనే ఆయన తేరుకుని దిలీప్ సుబరాయన్ కు పంచ్ ఇస్తారు. ఇలా ఈ పంచ్ రియాక్షన్ కొనసాగుతూ చివరగా కణల్ కన్నన్ మాస్టర్ ఆయన కుమార్తె శివ దర్శిని వస్తారు. ఈ వీడియోలో అనల్ అరసు.. విజయ్.. అన్బు-అరివు.. స్టన్ శివ ఇలా చాలామంది మాస్టర్ లు కనిపించారు. ఇక విజయన్ మాస్టర్ తనయుడు యాక్టర్ శబరీష్ కూడా కనిపించాడు.
అసలే ఫైట్ మాస్టర్ లు.. పైగా ఈమధ్య లాక్ డౌన్ తో చేతులు రఫ్ గా ఉండి ఉంటాయి.. అందుకే పంచులతో కిక్కులతో.. జంపింగులతో రెచ్చిపోయారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతం గా ఆకట్టుకుంటోంది. ఇలాంటి క్రేజీ వీడియో ప్లాన్ చేసిన మంచు విష్ణును కూడా చాలామంది మెచ్చుకున్నారు. ఆలస్యం కైకో.. జల్దీ దేఖో!