Begin typing your search above and press return to search.

‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

By:  Tupaki Desk   |   13 Oct 2021 12:40 PM IST
‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు
X
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాలు, విమర్శలు సాగుతున్న వేళ తాజాగా ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ‘పెన్షన్ల’ ఫైలుపై తొలి సంతకం చేయడం విశేషం.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వర్గం నుంచి వస్తున్న విమర్శలు, మూకుమ్మడి రాజీనామాలపై మంచు విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందని కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్ద మనుషుల ద్వారా సర్ది చెప్పించి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులను కలుపుకుపోతారా? లేక ‘మా’ బైలాస్ కు అనుగుణంగా కొత్త వాళ్లని వారి ప్లేసుల్లో రిప్లేస్ చేస్తారా? అన్నది చూడాలి.

మంచు విష్ణు హామీనిచ్చినట్టు ఎన్నికల్లో గెలవగానే.. పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేయడం విశేషం. ఇక త్వరలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్’ ద్వారా సభ్యుల ఫోర్ట్ పోలియో క్రియేట్ చేసి నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తామని తెలిపారు. మా భవన నిర్మాణం తన సొంత డబ్బులతో చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఉచిత ఆరోగ్యభీమా, మా సభ్యుడికి హెల్త్ కార్డులపై మంచు విష్ణు ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తిగా మారింది.