Begin typing your search above and press return to search.

పెద్ద సుత్తితో తల బద్దలు కొట్టాల్సిందే

By:  Tupaki Desk   |   18 Jun 2016 9:54 AM IST
పెద్ద సుత్తితో తల బద్దలు కొట్టాల్సిందే
X
ఒక్కోసారి ఒక్కో సెలబ్రిటీలు ఒక్కో కామెంట్ ఎందుకు చేస్తారో అసలు ఒక్క ముక్క కూడా మనకు అర్ధమవ్వదు. సరిగ్గా అలాంటి ఫిలసాఫికల్‌ ట్వీటు ఒకటి వేశాడు మంచు విష్ణు. ఎందుకు వేశాడు.. ఎవరి కోసం వేశాడు అనే విషయం తెలియదు కాని.. ఇప్పుడు ఫిలిం నగర్‌ లో ఇదే హాట్‌ టాపిక్ అయ్యింది.

''కొంతమంది అలా ఒక్కటి తట్టాలి. భుజం మీద కాదు. తల మీద. ఒక సుత్తితో తట్టాల్సిందే. అదీ మామూలు సుత్తితో కాదు.. థోర్‌ (సినిమా క్యారెక్టర్) వాడే సుత్తితో కొట్టేయాలి'' అంటూ ఒక ట్వీట్‌ వేశాడు మంచు విష్ణు. ఇంతకీ అంత గాట్టిగా సుత్తితో తల బద్దలు కొట్టేద్దాం అనుకుంటున్నాడంటే.. ఖచ్చితంగా అదేదో పెద్ద విషయమే అయ్యుండాలి. అవతలివారు ఎవరో పెద్ద నసే పెట్టుండాలి. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎవరైనా నిర్మాత అయ్యుంటాడా? లేదంటే తనకు కథలు చెబుతున్న కొత్త దర్శకుడు ఎవరన్నానా? డేట్లు ఇవ్వకుండా హ్యాండిచ్చిన హీరోయినా లేకపోతే కలసి నటిస్తానంటూ సైడ్ అయిపోయిన మరొక హీరోనా? లేదంటే రాష్ట్ర రాజకీయాలపై కామెంట్లు చేశాడా.. ఒకవేళ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పై తన విరక్తిని అలా తెలియజేశాడా? ఏదేమైనా విష్ణు మాత్రం ఫ్రస్ట్రేషన్‌ ను అలా చెప్పుకొచ్చాడు.

కాకపోతే సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్లు చేయకుండా ఉంటే కాస్త బెటరేమో. ఎందుకంటే అనవసరంగా రూమర్లకు ఆజ్యం పోసినట్లు అవుతుంది.