Begin typing your search above and press return to search.

వేర్ ఈజ్ ఓటర్ నానా?

By:  Tupaki Desk   |   30 May 2018 5:00 AM IST
వేర్ ఈజ్ ఓటర్ నానా?
X
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కెరీర్ లో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం ఎంతగా కష్టపడుతున్నాడో అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. మొదట లావుగా అయ్యారని సన్నగా అయ్యారు. ఆ తరువాత అందరికి నచ్చడం లేదని సరికొత్తగా బాడీ చూపించాడు. కండలు పెంచి ఓ వర్గం వారిని బాగా ఆకర్షించాడు గాని అనుకున్నంత రేంజ్ లో హీరోగా మాత్రం సక్సెస్ అవ్వడం లేదు.

ఇప్పుడైనా మంచి కథలు తగిలితే మంచు బ్రదర్స్ మంచి హిట్టు కొట్టగలరు. కానీ నమ్మిన సినిమాలన్నీ ప్రేక్షకులకు నిరాశే మిగులుస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. ఆ మధ్య ఓటర్ అనే కథ బాగా నచ్చిందని మంచు విష్ణు ఆ కథను స్టార్ట్ చేశాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ లుక్ వచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రాకపోవడం గమనార్హం. ఎదో ఒకటి రిలీజ్ చేస్తే సినిమా నడుస్తోంది అనే ఆలోచనలో జనాలు ఉంటారు.

లేటెస్ట్ గా వస్తున్న ఒక టాక్ ప్రకారం అయితే సినిమా అనుకున్నట్టుగా రాలేదని మళ్లీ రీ షూట్ చేస్తున్నారు అని ఒక టాక్ వచ్చింది. అయితే సీన్స్ రీ షూట్ చేస్తున్నారా లేక ఒక ఎపిసోడ్ కి సంబంధించి మొత్తం సీన్స్ రీ షూట్ చేస్తున్నారా అనేది ఇంకా తెలియరాలేదు. 'అడ్డా' మూవీ ఫేం కార్తిక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా లో నాని - జెంటిల్ మెన్ ఫెమ్ సురభి హీరోయిన్ గా నటిస్తోంది.