Begin typing your search above and press return to search.

అసూయగా ఉందంటున్న మంచు విష్ణు

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:30 AM IST
అసూయగా ఉందంటున్న మంచు విష్ణు
X
టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ మోహన్‌ బాబు కి డైలాగ్ డెలవరీలో తనకంటై ప్రత్యేక శైలిని కలిగి ఉన్నారు. ఆయన డైలాగ్‌ డెలవరీ కామెడీకి కామెడీ.. సీరియస్‌ కు సీరియస్‌ అన్నట్లుగా ఉంటుంది. కామెడీ సన్నివేశాల్లో ఆయన డైలాగ్‌ డెలవరీకి సీరియస్‌ సీన్స్‌ లో ఆయన డైలాగ్‌ డెలవరీకి పూర్తి విభిన్నంగా ఉంటాయి. అలాంటి డైలాగ్‌ డెలవరీకి తాను అభిమానిని అంటూ ఆయన తనయుడు మంచు విష్ణు తాజాగా మోహన్‌ బాబు నటించిన ఒక సినిమాలోని డైలాగ్‌ ను షేర్‌ చేశాడు. గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌ చెప్పడంలో మోహన్‌ బాబు తిట్ట అనడంలో సందేహం లేదు. ఆ వీడియోను షేర్‌ చేసిన మంచు విష్ణు ఇలా డైలాగ్‌ చెప్పడం చూస్తుంటే నాకు అసూయగా ఉందంటూ మంచు విష్ణు ట్వీట్‌ చేశాడు.

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మోహన్‌ బాబు ఇటీవలే సన్నాఫ్‌ ఇండియా సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేందుకు ఈయన సిద్దం అయ్యాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో మోహన్‌ బాబు పాత్ర చాలా తగ్గించారు అంటూ విమర్శలు వచ్చాయి. సినిమా బాగున్నందుకు అందులో మోహన్‌ బాబు పాత్ర ఎక్కుగా ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న మోహన్ బాబు తన కొడుకులు మరింతగా అసూయ పడేవిధంగా వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.