Begin typing your search above and press return to search.

స్టయిలిష్ట్ గా మారిపోయిన మంచు విష్ణు

By:  Tupaki Desk   |   26 Jan 2017 11:03 AM IST
స్టయిలిష్ట్ గా మారిపోయిన మంచు విష్ణు
X
మంచు విష్ణు లేటెస్ట్ మూవీ లక్కున్నోడు ఇవాళే రిలీజ్. ఈ సినిమాలో లక్కీ అనే పాత్రను పోషిస్తున్నాడీ మంచు హీరో. ప్రతీ విషయంలోను ఇతనికి లక్ ఉంటుంది కానీ.. ఈ పాత్రను కలిసినోడికి మాత్రం కష్టాలు ఎదురవుతాయని.. ట్రైలర్ లోనే చెప్పేశారు. దీనికి ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా జతచేసి.. అదృష్టం పరీక్షించుకుంటున్నాడు లక్కీ అలియాస్ మంచు విష్ణు.

'ఒక్క సారిగా 25 కోట్ల రూపాయలు చేతిలోకి వస్తే ఏం చేస్తారు' అన్న పాయింట్ ఆధారంగా ఈ సినిమా రూపొందిందంటూ.. అసలు పాయింట్ చెప్పేశాడు మంచు విష్ణు. 'సహజంగా ఇంత డబ్బు వస్తే ఓ వ్యక్తికి అన్ని సమస్యలు తీరిపోతాయని అనుకుంటాం. కానీ లక్కీకి ఏం జరిగింది' అన్నదే మా సినిమా అన్నాడు మంచు విష్ణు. ఈ మూవీకి స్టైలింగ్ కూడా తానే చేసుకున్నాడట. కాస్ట్యూమ్స్ డిపార్ట్ మెంట్ సహాయంతో.. లక్కీ కేరక్టర్ కోసం స్టైలింగ్ విషయంలో పలు ప్రయోగాలు చేశానని.. అవి అందరినీ ఆకట్టుకుంటాయన్న మంచు విష్ణు.. తను రియల్ లైఫ్ లో కూడా లక్కున్నోడినే అని భావిస్తానని చెప్పడం విశేషం.

'బహుశా దేశం మొత్తంలో ఓ 200 మంది స్టార్స్ ఉంటారేమో. 130 కోట్ల మంది ప్రజల్లో ఒకడిగా కాకుండా 200 మంది స్టార్స్ లో ఒకడిగా ఉండగలగడం అంటే అదృష్టమే కదా' అన్న మంచు విష్ణు వాదన కరెక్టే కదూ.!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/