Begin typing your search above and press return to search.

కార్ కంపెనీకి థాంక్స్ చెప్పిన విష్ణు

By:  Tupaki Desk   |   20 Jun 2016 5:08 PM IST
కార్ కంపెనీకి థాంక్స్ చెప్పిన విష్ణు
X
మంచు వారి కుటుంబం నిన్నటి రోజున పెద్ద షాక్ నే ఫేస్ చేయాల్సి వచ్చింది. మంచు విష్ణు భార్య విరానిక యాక్సిడెంట్ కు గురి కావడం మొత్తం టాలీవుడ్ నే భయపెట్టింది. అయితే.. అదృష్టవశాత్తూ ఆమెకు ఎటువంటి ప్రమాదం సంభవించక పోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదం నుంచి విరానిక సేఫ్ గా బయటపడ్డంపై.. భర్త విష్ణు స్పందించాడు. ముఖ్యంగా అంత ప్రమాదం జరిగినా.. లోపలున్న తన భార్యకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడానికి కారణమైన కార్ కు.. కార్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపాడు విష్ణు. 'వోల్వో కార్స్ గ్లోబల్ కంపెనీకి నేను థాంక్యూ చెప్పాల్సిందే. ఎక్స్ సీ 90 లాంటి భద్రమైన కార్ ను తయారు చేసినందుకు అభినందిస్తున్నాను. వేరే ఏ కార్ అయినా అయ్యుంటే.. తను ఇంత సేఫ్ గా ఉండేది కాదేమో' అంటూ తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో పోస్ట్ చేశాడు మంచు విష్ణు.

గత కొంతకాలంగా టాలీవుడ్ లో పలువురు ప్రముఖులకు జరిగిన యాక్సిడెంట్స్.. ఎన్నో విషాదాలకు కారణమయ్యాయి. మంచు ఫ్యామిలీకి నష్టం సంభవించకపోవడంతో.. అందరూ ఎంతో సంతోషించారు. డ్రైవింగ్ లో మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయం ఈ ప్రమాదం సూచిస్తోంది.