Begin typing your search above and press return to search.
కన్ఫ్యూజన్ లో పెట్టిన మంచు విష్ణు
By: Tupaki Desk | 12 March 2020 10:21 AM ISTగత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల దర్శకత్వం లో ‘ఢీ’ కి సీక్వెల్ తెరకెక్కబోతుందని మంచు విష్ణు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వరుసగా ఫ్లాప్స్ చవిచూసిన శ్రీనువైట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢీ 2 చేస్తే ఏ మేరకు సక్సెస్ ను దక్కించుకుంటాడు అనేది చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు మూడు రోజులుగా ఢీ 2 కన్ఫర్మ్ అయ్యింది అంటూ ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మంచు విష్ణుకు చాలా మంది ఫోన్ చేస్తున్నారట.
ఢీ 2 చిత్రం గురించి మంచు విష్ణు స్పందించి మరింత కన్ఫ్యూజన్ లో పెట్టాడు. ట్విట్టర్ లో ఢీ 2 గురించి మంచు విష్ణు స్పందిస్తూ... చాలా మంది నాకు ఫోన్ చేసి ఢీ 2 చిత్రాన్ని శ్రీనువైట్ల గారి దర్శకత్వంలో స్టార్ట్ అవ్వబోతుంది అంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. నాకు శ్రీనువైట్ల గారు అన్నలాంటి వారు. ఆయన్ని ఈ విషయం గురించి అడిగితే బాగుంటుంది. ప్రాజెక్ట్ డీటైటిల్స్ ఆయన అయితే చెప్తాడు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ ట్వీట్ చేశాడు.
మంచు విష్ణు ట్వీట్ తో ఢీ 2 ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది కాని ఇతర వివరాలు శ్రీనువైట్లను అడగండి అంటూ మంచు విష్ణు ఇండైరెక్ట్ గా చెప్పాడు అంటూ కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం మంచు విష్ణు సున్నితంగా ఢీ 2 విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు. అన్నా అంటూనే శ్రీనువైట్లతో సినిమా వద్దనుకుంటున్నట్లుగా మంచు విష్ణు చెప్పాడని కొందరు ఊహిస్తున్నారు. మొత్తానికి ఢీ 2 చిత్రంకు సంబంధించిన క్లారిటీ లేక జనాలు జట్టు పీక్కుంటున్నారు. మరి వైట్ల అయినా ఈ విషయమై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.