Begin typing your search above and press return to search.

మోహన్ బాబు.. ఐటెం రాజా

By:  Tupaki Desk   |   28 Nov 2015 10:39 PM IST
మోహన్ బాబు.. ఐటెం రాజా
X
విలక్షణ నటుడు మోహన్ బాబు అంటే ఇంట్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ భయభక్తులు బాగానే ఉంటాయి. ఆయన వ్యక్తిత్వం, ప్రవర్తన ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. మాటలోను, నడతలోనూ ఖచ్చితత్వం పాటించే మోహన్ బాబు.. కలుపుగోలుగా ఉన్నా అందులోనూ రిజర్వ్ డ్ నెస్ మెయింటెయిన్ చేస్తారు.

మరి అలాంటి మోహన్ బాబుని.. ఎవరైనా ఐటెం రాజా అని పిలవగలరా ? మామూలుగా అయితే.. అలా పిలిచే ఎవరూ ఉండరని చెప్పేయచ్చు. కానీ ఓ వ్యక్తి తన తండ్రిని అలా పిలుస్తాడని విష్ణు చెప్పడంతో.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. మామ మంచు అల్లుడు కంచు ఆడియో ఫంక్షన్ లో విష్ణు ఓ టాప్ సీక్రెట్ లాంటి విషయాన్ని బైటపెట్టేశాడు. మోహన్ బాబును.. ఐటెం రాజా అంటూ కమెడియన్ ఆలీ పిలుస్తారని చెప్పేశాడు.

అసలు ఇలా పిలవడానికి ఎవరికీ ధైర్యం ఉండదని, కానీ ఆలీ అంకుల్ మాత్రం స్పెషల్ అన్నాడు విష్ణు. అది వాళ్లిద్దరి మధ్యా అనుబంధంగా చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ పండుతుందని, అందుకే ఈ సినిమాని ఇద్దరూ కలిసి ఇంత సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారన్నాడు మంచు వారబ్బాయి. మొత్తానికి.. మోహన్ బాబుని కూడా నిక్ నేమ్ పెట్టి పిలిచేవాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారన్న మాట.