Begin typing your search above and press return to search.
తమ్ముడి ఫంక్షన్ లో నిజాలు చెప్పేసిన విష్ణు
By: Tupaki Desk | 30 Jan 2017 11:43 AM ISTగుంటూరోడు.. లవ్ లో పడ్డాడు అంటూ మంచు మనోజ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. తాజాగా ఈ గుంటూరోడికి ఆడియో ఫంక్షన్ నిర్వహించింది యూనిట్. ఈ వేడుకకు మోహన్ బాబుతో పాటు.. మనోజ్ తల్లి.. అన్న మంచు విష్ణు-అతని భార్య పిల్లలు కూడా హాజరయ్యారు.
'గుంటూరోడు ఆడియో ఫంక్షన్ కు రాక తప్పలేదు.. రాకపోతే ఇంట్లోకి ఎలో చేయరు. అందుకే వచ్చాను. యూనిట్ కు.. వచ్చిన అతిథులకు అందరికీ హాయ్' అన్న మంచు విష్ణు.. 'మ్యూజిక్ విషయంలో నాన్నగారికి ఉన్న ట్యాలెంట్ మనోజ్ కి వచ్చింది. నాకు ఆ డిపార్ట్ మెంట్ పై పట్టులేదు. బహుశా యాక్టింగ్.. డైలాగ్స్ విషయంలో వస్తుందేమో.. కాలమే చెప్పాలి. నా మరుసటి సినిమాకి మ్యూజిక్ విషయంలో హెల్ప్ చెయ్ మనోజ్. ప్రగ్యా.. చాలా అద్భుతంగా కనిపిస్తున్నావ్. నాన్న.. నా భార్య స్టేజ్ ఎదురుగా ఉన్నారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. మాట్లాడలేను' అంటూ సభా ముఖంగానే తమ్ముడి ట్యాలెంట్ ని పొగిడేయడమే కాదు.. ఓ రిక్వెస్ట్ ను కూడా పెట్టాడు. ఆ తర్వాతే అసలు సందడి మొదలైంది.
పాటల బాధ్యత మనోజ్ కి ఇచ్చారు కదా.. మరి దాన్ని నిలబెట్టుకుంటాడా అని సుమ అడిగితే.. 'వాడు ఇలాంటివి నిమిషానికి రెండు ప్రామిస్ లు చేస్తుంటాడు. ఆ అమ్మాయితో మాట్లాడలేదు అనే దగ్గర మొదలయ్యేవి అబద్ధాలు. వాడు చేసే తప్పులను నాన్న దగ్గర కప్పిపుచ్చడంతోనే నాకు టైం అంతా సరిపోయేది' అని చెప్పిన విష్ణు.. మాటల మధ్యలో.. 'పాపం మనోజ్ కి రీసెంట్ గా పెళ్లయింది'అనేశాడు. 'సారీ.. పాపం అన్నానా అలకాదులే'అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసినా సుమ మాత్రం వదల్లేదు.
ఇక టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు సాయిధరం తేజ్ ను ఉద్దేశించి.. 'సాయి చూసి నేర్చుకోమ్మా.. మనం బాగుపడకపోయినా పర్లేదు.. పక్కనోడు మాత్రం డాష్ అయిపోవాలి' అంటూ నవ్వులు చిందించాడు. గుంటూరోడు కారం ఘాటు ఇంట్లో చూపిస్తాడా అని అడిగితే.. 'మా అమ్మ చూడ్డానికే అలా ఉంటుంది. మా నాన్నకు కూడా భయం అమ్మంటే. మా ఇంటిని కంట్రోల్ లో పెట్టేది మా అమ్మే. మేం అందరం భయపడేది మా అమ్మ నోటికే. ఇదంతా నిజమే.. కాదని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఒక్కరినైనా చెప్పమనండి' అని విష్ణు అనడంతో.. 'నిర్మల గారు ఈజ్ కంట్రోలర్ ఆఫ్ ది షిప్' అంటూ ఈ టాపిక్ ని ముగించింది సుమ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/