Begin typing your search above and press return to search.

తనపై ట్రోలింగ్ చేయిస్తున్న ఆ బడా హీరో అందరికీ తెలుసు: మంచు విష్ణు

By:  Tupaki Desk   |   18 Oct 2022 11:38 AM GMT
తనపై ట్రోలింగ్ చేయిస్తున్న ఆ బడా హీరో అందరికీ తెలుసు: మంచు విష్ణు
X
మంచు వారబ్బాయి విష్ణు ఈ మధ్య సినిమాల్లోకంటే బయటి వివాదాలతోనే బాగా ఫేమస్ అవుతున్నాడు. అప్పట్లో మా అసోసియేషన్ లో అధ్యక్షుడిగా నిలబడి.. ప్రకాష్ రాజ్ తో తలపడి ఎంత హంగామా చేశాడో అందరికీ తెలిసిందే. సినిమాల్లో తక్కువ నటిస్తూ.. నటించినా ఆ మూవీలన్నీ ఫ్లాప్ అవుతుండడంతో ట్రోలింగ్ బారిన పడుతున్నాడు. అయితే తనపై ట్రోలింగ్ ను ఓ బడా హీరో దగ్గరుండి మరీ చేయిస్తున్నాడని.. దీనివెనుక కుట్ర ఉందని మంచు విష్ణు ఆరోపిస్తున్నాడు.

తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు బరెస్ట్ అయ్యాడు. తన తాజా చిత్రం 'జిన్నా' విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో సంచలన ఆరోపణలు చేశాడు.

ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 21న విడుదల అవుతోంది. సన్నీలీయోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో విష్ణు బిజీగా ఉన్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు విష్ణు తనపై ట్రోలింగ్ చేస్తున్నది ఎవరన్నదానిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ బడా హీరో తనను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయిస్తున్నట్టు విష్ణు కొన్ని రోజుల క్రితం ఆరోపించాడు.

తాజాగా ఆ బడా హీరో ఎవరన్నది బయటపెట్టే ఉద్దేశం ఉందా? అని అడగ్గా.. ఆ హీరో ఎవరో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అని.. తన నోటితో చెప్పాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. మా ఎలక్షన్ టైం నుంచి నాపై ట్రోలింగ్ మొదలైందని విష్ణు తెలిపారు. మనుషులను బట్టి పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడని.. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని తెలిసిందని తెలిపారు.

ఇక తనపై ట్రోలింగ్ చేసే హీరో ఎవరో మీడియాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఆయన పేరు రివీల్ చేయడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యల వెనకున్న ఆ బడా హీరో ఎవరన్నదానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.