Begin typing your search above and press return to search.

సూసైడ్ రాజకీయాలపై మంచు కామెంట్స్

By:  Tupaki Desk   |   20 Jan 2016 11:00 PM IST
సూసైడ్ రాజకీయాలపై మంచు కామెంట్స్
X
హెచ్ సీ యూ స్టూడెండ్ రోహిత్ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటివరకూ తెలుగు రాష్ట్రాలవరకే పరిమితం అయినా, రాహుల్ గాంధీ వచ్చాక ఇది నేషనల్ ఇష్యూగా టర్న్ తీసుకుంది. అన్ని రాజకీయ పార్టీలు రోహిత్ ఆత్మహత్యను క్యాష్ చేసుకునేందుకు ట్రై చేసేస్తున్నాయి. సమస్యను పక్కదారి పట్టించి, పక్క పార్టీల మీద రాళ్లేసేందుకు ట్రై చేస్తున్నారు అంతా.

ఈ మొత్తం ఇష్యూపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు స్పందించాడు. సున్నితంగానే మాట్లాడినా, అంతర్గతంగా గట్టి చురకలే వేశాడు. "న్యాయం కోసం రోహిత్ వేముల అరిచినపుడు ఎవరూ వినలేదు(వినాలని అనుకోలేదు.). ఇప్పుడు అతని మరణం తర్వాత అతనికి అన్నీ పెద్ద పెద్ద శబ్దాలే వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు రోహిత్ పోస్టర్ అయిపోయాడు. అసలు వీళ్లకి మన దేశంలో చాలామంది రోహిత్ వేముల లాంటి వ్యక్తులు ఉన్నరని తెలుసా"అని ప్రశ్నించాడు విష్ణు.

అంతే కాదు"మనం నెమ్మదిగా మానవత్వాన్ని కోల్పోతున్నాం. రోహిత్ ఎందుకోసం మరణించాడో.. కనీసం దాన్నైనా గుర్తు పెట్టుకుందాం " అంటూ శవ రాజకీయాలు చేస్తున్న పార్టీలకు బాగానే చురక అంటించాడు మంచు హీరో. సామాజిక సమస్యలపై అందరూ సైలెంట్ గా ఉంటున్నా.. విష్ణు మాత్రం స్పందిస్తూనే ఉన్నాడు. మత అసహనం గురించి కూడా మొదట మాట్లాడిన టాలీవుడ్ హీరో విష్ణు ఒక్కడే.