Begin typing your search above and press return to search.

మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు

By:  Tupaki Desk   |   24 March 2023 8:02 PM IST
మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు
X
మంచు మోహన్ బాబు నట వారసులైన ఇద్దరు తెలుగు హీరోల మధ్య విభేదాలు ఉన్నాయన్న సంగతి ఈరోజు ఒక్క వీడియోతో బయటపడింది. విష్ణు దాడికి వెళుతున్నట్టుగా ఉన్న ఒక వీడియో మీడియాలో వైరల్ కావడంతో వీరి మధ్య ఏదో జరుగుతోందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

వివాదానికి సంబంధించిన వివరాలు పూర్తిగా స్పష్టంగా తెలియదు. అయితే విష్ణు ఇంట్లోకి చొరబడి తన కుటుంబ సభ్యులు, బంధువులపై శారీరకంగా దాడి చేశాడని మనోజ్ తన ఫేస్‌ బుక్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు.

ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డు కునేందుకు ప్రయత్నించగా విష్ణు ఒకరి పైకి దూకుడుగా వెళుతున్న వీడియో బయటకు వచ్చింది. వివాదానికి మూలం మనోజ్ వివాహం నుంచే మొదలైందని.. వీడియోను మనోజ్ రికార్డ్ చేసినట్లు అందరికీ అర్థమైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది.

ఇక మంచు మనోజ్ తో గొడవపై తాజాగా అన్నయ్య మంచు విష్ణు స్పందించాడు. 'మా ఇద్దరి మధ్య గొడవలు సాధారణమే.. అది నిన్న ఉదయం జరిగిన చిన్న ఘటన. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు. అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్న వాడు. ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు' అంటూ విష్ణు వివరణ ఇచ్చాడు.

ఇక ఈ గొడవ గురించి అక్క మంచు లక్ష్మీ వివరణ ఇచ్చింది. విష్ణు, మనోజ్ తో మాట్లాడిన తర్వాత స్పందిస్తానని లక్ష్మీ మీడియాకు తెలిపారు.

ఇటీవలే అక్క మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్.. భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నాడు. మోహన్ బాబు మరియు విష్ణు వారి కుటుంబాలతో కలిసి వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు విష్ణు అతిథిగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.