Begin typing your search above and press return to search.

నేను బాగానే ఉన్నా: విష్ణు

By:  Tupaki Desk   |   7 Aug 2017 1:27 PM IST
నేను బాగానే ఉన్నా: విష్ణు
X
మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ మ‌లేషియాలో జ‌రుగుతోంది. షూటింగ్ సంద‌ర్భంగా స్టంట్‌ చేస్తూ విష్ణు, ప్ర‌గ్యా జైశ్వాల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత మంచు విష్ణు తొలిసారిగా సోష‌ల్ మీడియాలో స్పందించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానంటూ విష్ణు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను చిన్న జాగ్ర‌త్త‌ పాటించ‌కోవ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఈ ఘ‌ట‌న వ‌ల్ల బాధ‌ప‌డిన‌వారంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని విష్ణు తెలిపాడు.

‘అందరికీ నమస్కారం. ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రీకరణ సమయంలో మలేషియాలో జరిగిన ప్రమాదంలో నేను గాయపడ్డాను. చాలా మందికి దీని గురించి తెలుసు. ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు. ముందుగా నేను అమ్మకి - నాన్నకి - పిన్నికి - అక్కకి - తమ్ముడికి సారీ చెప్పాలి. ఎందుకంటే నేను తీసుకోని ఓ చిన్న జాగ్రత్త వల్ల వీళ్లంతా చాలా బాధపడ్డారు. వాళ్లతోసహా ఎంతో మంది నా స్నేహితులు - నా శ్రేయోభిలాషులు, అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. వారందరినీ క్షమాపణ కోరుతున్నాను. రెండు మూడు రోజుల్లో అసలేం జరిగింది అన్న విషయమై వీడియో రిలీజ్‌ చేస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది అందులో నా తప్పేమీ లేదని. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే.. అది కేవలం దేవుడు ఇచ్చిన వరం..’ అంటూ వీడియో పోస్ట్ చేశాడు విష్ణు.