Begin typing your search above and press return to search.
స్టార్ హీరోను కొనియాడిన మంచు విష్ణు.. హ్యాండ్సమ్ అంటూ!!
By: Tupaki Desk | 16 Jan 2021 7:50 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో వేడుకలలో కనిపించడం అరుదుగా చూస్తుంటాం. రీసెంట్ గా అదే జరిగింది. మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత కలిసి మంచు విష్ణు కుటుంబంతో సందడి చేశారు. ఎందుకో తెలుసా.. నిన్న రాత్రి మంచు విష్ణు భార్య విరానిక పుట్టినరోజు. ఈ సందర్బంగా మహేష్ బాబు ఫ్యామిలీని విష్ణు పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించడం జరిగింది.
అయితే ఆ వేడుకలకు మహేష్ ఫ్యామిలీ హాజరై విష్ణు ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్బంగా వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పుట్టినరోజు వేడుకలో మహేష్ ఫ్యామిలీ హాజరుకావడంతో మంచు ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయినట్లుగా తెలుస్తుంది.
ఈ వేడుకలకు మహేష్ ఫ్యామిలీతో పాటు హీరో గోపీచంద్ తదితరులు పాల్గొన్నారట. ఈ సందర్బంగా మహేష్ బాబును ఉద్దేశించి మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. మహేష్ నమ్రతలతో కలిసి విష్ణు, ఆయన భార్య విరానిక దిగిన ఫోటోను విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. 'ఈ ఫోటోలో ఒక వ్యక్తి రోజురోజుకి యవ్వనంగా, హ్యాండ్సమ్ గా మారుతున్నాడు.
బహుశా ఆయన మంచితనం, మంచి హృదయం వలనే ఇలా ఉన్నాడని నేను బలంగా నమ్ముతున్నాను' అంటూ విష్ణు పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో చూస్తే మహేష్ బాబు మీసాలు లేకుండా జీన్స్ టిషర్ట్ ధరించి భార్య నమ్రత పక్కన హ్యాండ్సమ్ గా నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో, మంచు విష్ణు 'మోసగాళ్లు' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.