Begin typing your search above and press return to search.

మంచు వారి కష్టాలు ఇన్నిన్ని కావయా..

By:  Tupaki Desk   |   2 May 2018 1:30 AM GMT
మంచు వారి కష్టాలు ఇన్నిన్ని కావయా..
X
టాలీవుడ్లో బాగా పేరున్న కుటుంబాల్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఒకటి. ఐతే ఇండస్ట్రీలో మిగతా ఫ్యామిలీలకు చెందిన వాళ్లందరి పరిస్థితి బాగానే ఉంది కానీ.. మంచు వారి కష్టాలే మామూలుగా లేవు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఫ్లాపుల్లో పడి కొట్టు మిట్టాడుతూ వరుసగా దారుణ పరాభవాలు ఎదుర్కొంటోంది. ఇంతకుముందు ఓ మోస్తరు విజయాలతో సాగిపోతూ ఉండేది మంచు కుటుంబం. ఒకరు ఫెయిలైనా మరొకరు సక్సెస్ సాధించేవాళ్లు. ఓ మోస్తరుగా బండి నడిచిపోయేది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి దారుణంగా ఉంది. మంచు మనోజ్ ఓ మోస్తరు విజయాన్నందుకుని చాలా కాలమైంది. అతను రెండేళ్ల కిందట ‘శౌర్య’.. ‘ఎటాక్’ లాంటి డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. గత ఏడాది ‘గుంటూరోడు’.. ‘ఒక్కడు మిగిలాడు’ తీవ్ర నిరాశను మిగిల్చాయి. మంచు లక్ష్మి ‘లక్ష్మీబాంబు’తో షాక్ తింది. ఇక మంచు విష్ణు గత ఏడాది ‘లక్కున్నోడు’తో ఎదురు దెబ్బ తిన్నాడు.

కొత్త ఏడాదిలో అయినా కథ మారుతుందేమో అనుకుంటే.. మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ చిత్రం వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. కనీస ఓపెనింగ్స్ కరవయ్యాయి. పోనీ మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ అయినా రాత మారుస్తుందేమో అనుకుంటే దాని పరిస్థితి అలాగే తయారైంది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా దారుణ ఫలితాన్నందుకుంది. ఈ చిత్రానికి కూడా కనీస ఓపెనింగ్స్ లేవు. జనాలు అసలు ఈ సినిమాను పట్టించుకోనే లేదు. మొత్తంగా మంచు వారి పరాజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇలా వరుస ఫ్లాపులు ఎదురయ్యేుసరికి ఆ ఫ్యామిలీ నటుల సినిమాలంటేనే ఒక నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తోంది జనాలకు. ఇక మంచు లక్ష్మి సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’ మీద ఆ ఫ్యామిలీ ఆశతో ఉంది. ఇదొక వైవిధ్యమైన థ్రిల్లర్ అనిపిస్తోంది. మరి ఆ చిత్రమైనా మంచు ఫ్యామిలీకి ఉపశమనానిస్తుందేమో చూడాలి.