Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్ళే ఆచారి.. ఎక్కడా కనిపించడే?

By:  Tupaki Desk   |   24 Jan 2018 1:19 PM GMT
అమెరికా వెళ్ళే ఆచారి.. ఎక్కడా కనిపించడే?
X
పెద్ద పెద్ద స్టార్ హీరోలకు అమెరికా వంటి ఓవర్సీస్ ఏరియాల్లో పెద్దగా ప్రమోషన్లను చేయకపోయినా చెల్లిపోతుంది. ఎందుకంటే వారి ఇమేజ్ అలాంటిది. పైగా ఇక్కడ నుండి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన చాలామంది ఎన్నారైలు వారి ఫ్యాన్స్ అయ్యుంటారు. అయితే అమెరికాలో మార్కెట్ పెద్దగా లేని హీరోలు మాత్రం.. అక్కడ సినిమాలు రిలీజ్ చెయ్యాలంటే భారీగా ప్రమోషన్లు చేయాల్సిందే. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు అనేగా? పదండి అక్కడికే వస్తున్నాం.

అసలు జనవరి 26న విడుదల చేయాల్సిన తన సినిమాను పోస్టుపోన్ చేసుకున్నాడు మంచు విష్ణు. ''ఆచారి అమెరికా యాత్ర'' అంటూ ఇప్పుడు కామెడీ సినిమాలు తీసే జి.నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్లో ఈ సినిమాతో వస్తున్నాడు. ఒక ప్రక్కన వరుసగా నాలుగేళ్ల నుండి అన్నీ ఫ్లాపులే కొడుతున్న విష్ణు.. ఆ మధ్యన ఈడోరకం ఆడోరకం సినిమాతో మాత్రమే హిట్ ను చవిచూశాడు. ఆ సినిమాకు కూడా రాజ్ తరుణ్‌ అండ్ హెబ్బా పటేల్ కారణంగా బాగా కలక్షన్లు వచ్చేశాయి. కాని ఇప్పుడు మాత్రం ఆచారి అమెరికా యాత్ర సినిమాకు ఎక్కడా పెద్దగా హైపే కనిపించట్లేదు. ముఖ్యంగా అమెరికాలో మాత్రం అస్సలు సినిమా గురించి టాక్ లేదని అంటున్నారు. అసలు కామెడీ సినిమాలు అమెరికా వంటి చోట క్లిక్ అవ్వడం రేర్ కాని.. క్లిక్ అయితే మాత్రం కాసుల పంటే. కాబట్టి మంచు విష్ణు అక్కడేమన్నా ఫోకస్ పెడితే బెటరేమో.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు అంతగా బజ్ లేదు కాని.. ఒకవేళ ఎవరన్నా పలానా కమ్యూనిటీ వారు మేం హర్టయ్యాం అంటూ ఏదన్నా గొడవ చేస్తే మాత్రం కాస్త రచ్చయ్యే ఛాన్సుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు ఫిబ్రవరి 16ను రిలీజ్ డేటుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అది సంగతి.