Begin typing your search above and press return to search.

ప్ర‌కాష్ రాజ్ ఆశ‌లు ఆవిరి అయ్యే కిటుకు క‌నిపెట్టాడా?

By:  Tupaki Desk   |   10 July 2021 2:30 AM GMT
ప్ర‌కాష్ రాజ్ ఆశ‌లు ఆవిరి అయ్యే కిటుకు క‌నిపెట్టాడా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎల‌క్ష‌న్స్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఎప్ప‌టిలానే ఈసారి కూడా మా ఎల‌క్ష‌న్స్ లో ర‌స‌వ‌త్త‌ర ఉత్కంఠ నెల‌కొంది. ఈసారి అధ్య‌క్ష ప‌దవి రేసులో కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీంతో మునుప‌టి కంటే ఇప్పుడు మా ఎలెక్ష‌న్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఎంత మంది ఉన్నా ఈసారి రేస్ లో ఇద్ద‌రి మ‌ధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ - మంచు విష్ణు మ‌ధ్య కీల‌క పోటీ జ‌ర‌గ‌నుంద‌ని భావిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ దూకుడు పెంచారు. ఆయ‌న త‌న ప్యానెల్ ని అంద‌రి కంటే ముందే ప్ర‌క‌టించి ఒక మెట్టు పైనున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌కాశ్ రాజ్ వైపే చాలా మంది అసోసియేష‌న్ స‌భ్యులు మొగ్గు చూపారు కానీ అనూహ్యంగా ఇప్పుడు లెక్క‌లు మారుతున్న‌ట్లుగా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ముందు నుంచి కాంట్ర‌వ‌ర్శీల‌కు దూరంగా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయే మంచు విష్ణు మా అధ్య‌క్ష రేసులో అంద‌రి ఫేవరేట్ గా ఉన్నార‌ని టాక్. పోరాడే వారి కంటే లౌక్యంతో ముందుకు పోయే వారి వైపే మా స‌భ్యులు ఇప్పుడు చూస్తున్నట్లుగా స‌మాచారం. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు గ‌నుక మా అధ్య‌క్షడు అయితే ఎలాంటి డెవ‌ల‌ప్ మెంట్స్ కి ఆస్కారం ఉందో చూడాలి. ఒక‌వేళ తాను అధ్య‌క్షుడిని అయితే మా సొంత భ‌వంతి కోసం పావ‌లా వంతు ఖ‌ర్చు త‌న‌దేన‌ని విష్ణు వెల్ల‌డించారు. ఇత‌ర మొత్తాన్ని నిధి రూపంలో సేక‌రించే వీలుంది.

ఇక మంచు విష్ణు నుంచి ఇటీవ‌లే విడుద‌లైన మోస‌గాళ్లు మూవీ థియేట‌ర్స్ లో స‌రిగ్గా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ అమెజాన్ లో మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ దిగ్గ‌జ ఓటిటి ట్రెండింగ్ తెలుగు ఫిల్మ్స్ లిస్ట్ లో మంచు విష్ణు మోస‌గాళ్లు చోటు ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో కాజ‌ల్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా హాలీవుడ్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు.