Begin typing your search above and press return to search.

`జిన్నా`గా మారి ఇంత‌కీ ఏం చేయ‌బోతున్నాడు?

By:  Tupaki Desk   |   7 Sep 2022 4:57 PM GMT
`జిన్నా`గా మారి ఇంత‌కీ ఏం చేయ‌బోతున్నాడు?
X
టాలీవుడ్ నటుడు విష్ణు మంచు మా ఎన్నిక‌ల్లో గెలిచి అధ్యక్షుడైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అత‌డు న‌టించే సినిమాల అప్ డేట్ లేవీ రాలేదు. అంత‌కుముందు ప్ర‌క‌టించిన సినిమాలు హోల్డ్ లోనే ఉన్నాయి. కొంత గ్యాప్ త‌ర్వాత `జిన్నా` అంటూ వేడెక్కించే టైటిల్ తో సినిమా మొద‌లెట్టాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ వీడియో పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సన్నీ లియోన్ - పాయల్ రాజ్ పుత్  కథానాయికలుగా నటిస్తున్నారు. పెద్ద తెర నిండుగా రొమాన్స్ కి కొద‌వేమీ లేద‌ని తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ వెల్ల‌డిస్తోంది. ఫ్రాకులో స‌న్నీలియోన్.. చీర‌లో పాయ‌ల్ టూ హాట్ గా క‌నిపిస్తున్నారు.


లేటెస్ట్ అప్ డేట్ ప్ర‌కారం.... ఈ సినిమా టీజర్ ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు. అదే విషయాన్ని ధృవీకరించడానికి నాయ‌కానాయిక‌ల‌తో స‌రికొత్త రొమాంటిక్ పోస్టర్ విడుదలైంది. తాజాగా ఈ సినిమాలో ఓ పాట చిత్రీకరిస్తున్న సమయంలో నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ - సునీల్ తదితరులు కూడా నటిస్తున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని AVA ఎంటర్ టైన్ మెంట్ - 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 5న తెలుగు- హిందీ- మలయాళ భాషల్లో విడుదల కానున్న జిన్నా చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరకర్త.

శ్రీ‌నువైట్ల‌తో ఢీ సీక్వెల్ ఏమైన‌ట్టు?

నిజానికి జిన్నా ప్రారంభం కాక ముందే మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా ఢీ  సీక్వెల్ కోసం శ్రీ‌నువైట్ల స‌న్నాహ‌కాలు చేసిన సంగ‌తి తెలిసిందే. క‌థానాయిక‌ల‌ను కూడా ఎంపిక చేసార‌ని ప్రచార‌మైంది. ఢీ కంటే రెట్టింపు వినోదాన్ని అందిస్తామ‌ని కూడా ప్రామిస్ చేసారు విష్ణు. కానీ మ‌ధ్య‌లో ఏమైందో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్ డేట్ ఏదీ రాలేదు. త్వ‌ర‌లోనే దీనిపై ఏదైనా వివ‌రాన్ని విష్ణు టీమ్ వెల్ల‌డిస్తారేమో చూడాలి. విష్ణు- జెనీలియా జంట‌గా శ్రీ‌నువైట్ల తెర‌కెక్కించిన ఢీ చిత్రం అప్ప‌ట్లో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విష్ణు కోసం జెనీలియా నేరుగా హైద‌రాబాద్ కి వ‌చ్చి `మా` ఎన్నిక‌ల్లో ఓటు కూడా వేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.