Begin typing your search above and press return to search.

బ్ర‌ద‌ర్ ఓటుకు ఇచ్చింది 75 వేలు.. క‌రెక్ట్ చేస్కోండి!-మంచు విష్ణు

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:30 PM GMT
బ్ర‌ద‌ర్ ఓటుకు ఇచ్చింది 75 వేలు.. క‌రెక్ట్ చేస్కోండి!-మంచు విష్ణు
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నానికి రిజ‌ల్ట్ కూడా తేలిపోనుంది. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెల్స్ వార్ న‌డుస్తోంది.

తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోని ప్ర‌క‌టించిన మంచు విష్ణుకు మీడియా ప్ర‌తినిథుల‌ నుంచి కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఇందులో ఓటుకు నోటు ప్ర‌ధాన‌మైన‌ది. ఇప్ప‌టికే ఒక్కొక్క ఓటుకు మంచు విష్ణు 10వేల చొప్పున పంచార‌ని ప్ర‌చార‌మైంది. దీనిపై మీడియా ప్ర‌శ్నించ‌గా.. బ్ర‌ద‌ర్ నిజ‌మే ఓటుకు 75వేలు ఇచ్చాను. క‌రెక్ట్ చేసుకోండి. నా కుటుంబ స‌భ్యులైన అక్క త‌మ్ముడు మా నాన్న‌కు కూడా డ‌బ్బు ఇచ్చాను.. మ‌హేష్ కి గూగుల్ పే చేశాను! ఓటు వేయ‌క‌పోతే రిట‌న్ అడుగుతాను. నేను డ‌బ్బు ఇచ్చిన వారంతా వెన‌క్కి ఇవ్వాలి.. అంటూ విష్ణు ఛ‌మ‌త్కారంగా మాట్లాడారు.

ఆర్టిస్టులంతా ఒకే కుటుంబంలా ఉన్నామ‌ని .. దానిని నిరూపిస్తాన‌ని కూడా విష్ణు ఛాలెంజ్ చేశారు. ఓటుకు నోటు గురించి అడిగిన‌ప్పుడు మాత్రం త‌న‌దైన శైలిలో పంచ్ లు వేసారు.