Begin typing your search above and press return to search.
మంచు విష్ణు ప్రయోగం.. రిలీజ్ చేయకుండానే ఫ్రీగా సినిమా చూపిస్తాడట!
By: Tupaki Desk | 8 March 2021 4:38 PM ISTఎన్ని కోణాల్లో విశ్లేషించినా.. ఎన్ని విషయాల గురించి మాట్లాడుకున్నా.. ఫైనల్ గా సినిమా అంటే వ్యాపారం. కలెక్షన్ సరిగా లేకపోతే.. అంతా వట్టిదే. అందుకే.. టిక్కెట్లు తెగే మార్గం వెతుకుతుంటారు మేకర్స్. దీనికోసం రకరకాల మార్గాలను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం మంచు విష్ణు కూడా ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు.
ఈ ప్లాన్ లో భాగంగా.. తన సినిమాను ఫ్రీగా ప్రేక్షకులకు చూపించబోతున్నాడట. అయితే.. మొత్తం కాదు. కేవలం 10 నిమిషాల సినిమాను రిలీజ్ కు ముందే చూపిస్తాడట. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి, మొదటి పది నిమిషాల సినిమాను ప్రసారం చేస్తారట.
గతంలోనూ పలు సినిమాలకు ఇలాంటి వ్యూహాన్ని అనుసరించినప్పటికీ.. వాళ్లు ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. కానీ.. ఇలా ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ సినిమా చూపించడం ఇదే మొదటి సారి. ఈ విధానం వల్ల తర్వాత ఏం జరగనుంది? అనే క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ చేయడమే లక్ష్యం. ఇలా చూసిన వారంతా థియేటర్‌కు వచ్చి మిగిలిన భాగం చూస్తారనేది మేకర్స్ నమ్మకం.
విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న 'మోసగాళ్లు' చిత్రానికి సంబంధించిన బిజినెస్ ప్లానే ఇదంతా. బ్యాంకును కొల్లగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో టాప్ హీరోయిన్ కాజల్ విష్ణు చెల్లిగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. మరి, ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.