Begin typing your search above and press return to search.
జగదేకవీరుడు లాంటివి మేమూ చేస్తాం
By: Tupaki Desk | 14 April 2016 3:00 PM ISTఇప్పుడొస్తున్న సినిమాలు మూస ధోరణిలో ఒకే రకంగా ఉంటున్నాయనే విమర్శ వినిపిస్తూనే ఉంది. ఊపిరి - క్షణం లాంటి సినిమాలు అప్పుడప్పుడూ మాత్రమే వస్తున్నాయి. మరి ఇప్పటి స్టార్లు కొత్త కాన్సెప్టులను వంట పట్టించుకోలేరా అని అడిగితే.. మంచు విష్ణు ఇచ్చిన ఆన్సర్ అందరినీ ఆలోచింప చేసింది.
'మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఊపిరి - క్షణం లాంటివాటిని బడ్జెట్ యాంగిల్ లో చూడలేం. అసలు మంచి సినిమాలు తీయడం దర్శకుల పనే. కథ ఉంటే మేం మాత్రం చేయమా? జగదేకవీరుడు-అతిలోక సుందరి.. అసెంబ్లీ రౌడీ లాంటి కథలను డైరెక్టర్లను తెమ్మనండి. నేనే కాదు.. చేయడానికి ఎవరైనా సిద్దమే.' అంటూ మనసులో మాట చెప్పడంతో పాటు.. సినిమాలు మూసగా ఉండడానికి దర్శకుల ఆలోచనలే కారణమని తేల్చేశాడు మంచు విష్ణు.
అలాగే.. తన కేరక్టర్ ఎంత లెంగ్త్ ఉంటుందనే విషయాన్ని పట్టించుకోనంటున్నాడు విష్ణు. ఐదు నిమిషాల పాత్రతో అయినా.. తను ఇంపాక్ట్ చూపించగలనని, అలాంటి నమ్మకం ఇతర హీరోలకు లేకపోవడంతోనే చేయడానికి ముందుకు రావడంలేదనుకుంటా అంటున్నాడు. మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ఈడో రకం ఆడో రకం ఇవాళే రిలీజ్ అయింది.