Begin typing your search above and press return to search.

మంచువారింట అడుగుపెట్టిన మరో అమ్మాయి

By:  Tupaki Desk   |   9 Aug 2019 5:13 PM IST
మంచువారింట అడుగుపెట్టిన మరో అమ్మాయి
X
ఈ రోజు శ్రావణశుక్రవారం పైగా వరలక్ష్మీ వ్రతం.. దేవుడు గట్రా విషయాలను నమ్మే హిందువులు చాలా మంచిరోజుగా భావిస్తారు. సరిగ్గా ఇదేరోజు మంచు ఫ్యామిలీకి ఆనందం డబల్ అయింది. ఎందుకంటే మంచు విష్ణు సతీమణి విరానిక ఓ పండంటి పాపకు జన్మనిచ్చారు. దీంతో మంచు కుటుంబంలో వేడుకలు మొదలయ్యాయి.

మంచు విష్ణు - విరానిక దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అరియానా.. వివియానా అనే కవల అమ్మాయిలు.. అవ్రామ్ భక్త అనే అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు జన్మించిన పాప నాలుగవ సంతానం. ఈ వార్త తెలిసిన మంచు ఫ్యామిలీ సన్నిహితులు.. బంధువులు.. అభిమానులు విష్ణును అభినందనలతో ముంచెత్తుతున్నారు. నిన్న మంచు విష్ణు తన సతీమణి డెలివరీని ఇన్స్టా గ్రామ్ లో లైవ్ ఇస్తానని ప్రకటించడం.. అందుకు విరానిక 'ఇంట్లోనుంచి తరిమేస్తా'నని బెదిరించడం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా విష్ణు ఆలోచనకు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా చూసిన విష్ణు 'భార్యతో గొడవ పెట్టుకోలేనని' కారణం చూపుతూ తన ఆలోచనను విరమించుకున్నాడు.

విష్ణు సినిమాల విషయానికి వస్తే చివరి చిత్రం 'ఓటర్' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఇంకా మరో ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. ప్రస్తుతం విష్ణు తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన కథాచర్చల్లో బిజీగా ఉన్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.