Begin typing your search above and press return to search.
కాల్ సెంటర్ లో హీరో భార్య పెట్టుబడి
By: Tupaki Desk | 2 Oct 2019 10:20 AM ISTహీరో భార్యామణి కాల్ సెంటర్ లో పెట్టుబడి పెడుతున్నారా? అంటే అవుననే సమాచారం. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాలి. అందాల కథానాయిక కాజల్ నటిస్తున్న తొలి హాలీవుడ్ చిత్రం కాల్ సెంటర్. ఇటీవలే టైటిల్ ని ప్రకటించారు. ఇంగ్లీష్- తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు తెలుగు వెర్షన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆసక్తికరంగా ఈ చిత్రంలో కాజల్ .. మంచు విష్ణుకి చెల్లెలిగా నటిస్తున్నారు. రుహానీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ కి తగ్గట్టే సినిమా కథాంశం ఓ కాల్ సెంటర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇందులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇదే అతడికి తెలుగులో తొలి సినిమా. విష్ణు తెలుగు వెర్షన్ లో కథానాయకుడిగా కనిపిస్తారు.
మంచు విష్ణు భార్య విరోనిక నిర్మిస్తున్న తొలి చిత్రమిది. వీఎంఆర్ ఎంటర్ టైన్ మెంట్- ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చందమామ కాజల్ రెగ్యులర్ కంటెంట్ ఉన్న సినిమాల కంటే ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలకే ప్రాధాన్యతనిస్తుండడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. కాజల్ నటిస్తున్న తొలి హాలీవుడ్ చిత్రం ఎలా ఉండనుందో చూడాలన్న ఆసక్తి అందరిలో ఉంది.