Begin typing your search above and press return to search.

ఆచారి కూడా రేసులోకి వచ్చాడే

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:55 PM GMT
ఆచారి కూడా రేసులోకి వచ్చాడే
X
2018 సంక్రాంతి నుంచి సినిమాల పోరు పిక్స్ అయిపోయింది. పొంగల్ కు పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ ఇప్పటికే ఫిక్స్ అయిపోగా.. కనీసం మరో రెండు సినిమాలు రేసులో దూరేందుకు ట్రై చేస్తున్నాయి. ఆ తర్వాత రిపబ్లిక్ డే వీకెండ్ కోసం కూడా పోటీ గట్టిగానే ఉండనుంది.

రిపబ్లిక్ డే గురువారం నాడు కావడంతో.. ఎక్స్ టెండెడ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. అనుష్క మూవీ భాగమతి.. దండుపాళ్యం3.. రాజరథం.. అభిమన్యుడు.. సందీప్ కిషన్ మూవీ మనసుకు నచ్చింది ఇప్పటికే.. జనవరి 25- 26 తేదీలను ఫిక్స్ చేసేసుకున్నాయి. వీటిలో భాగమతి భారీ చిత్రం. ప్రభాస్ సన్నిహితులు నిర్మిస్తున్న మూవీ కావడంతో రిలీజ్ కూడా భారీగానే ఉండడం ఖాయం. మరోవైపు మహేష్ బాబు సోదరి మంజుల నిర్మిస్తున్న మూవీ మనసుకు నచ్చింది పై కూడా బజ్ బాగానే ఉంది. ఇలాంటి పోటీ మధ్యలో తాను కూడా సై అంటున్నాడు మంచు విష్ణు.

ఆచారి అమెరికా యాత్ర అంటూ మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మూవీ దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసేసుకుంది. బ్రహ్మానందం కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని.. జనవరి 26కు షెడ్యూల్ చేశారు. పోటీ ఎక్కువగానే ఉన్నా.. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఇలా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. కామెడీ టైమింగ్ విషయంలో బ్రహ్మానందం-మంచు విష్ణు కాంబోకు బోలెడంత క్రేజ్ ఉంది. ఇది ఆచారికి ఎంత మాత్రం హెల్ప్ అవుతుందో చూడాలి.