Begin typing your search above and press return to search.

ఎన్ని డేట్లు మారుస్తావ్ ఆచారి???

By:  Tupaki Desk   |   22 March 2018 8:04 AM GMT
ఎన్ని డేట్లు మారుస్తావ్ ఆచారి???
X
చాలా వరకు కొన్ని సినిమాలు మొదలయ్యేటప్పుడు చాలా గ్రాండ్ గా స్టార్ట్ అవుతాయి. షూటింగ్ కూడా బాగానే సాగుతుంది. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతాయో మాత్రం చెప్పలేము. అలాంటి సినిమాలు ప్రతి ఏడాది కనిపిస్తూనే ఉంటాయి. షూటింగ్ కారణాల వల్ల వాయిదా పడటం కామన్. ఎన్నో సినిమాలు ఈ ఏడాదే రాబోతున్నట్లు చెప్పి మరో ఏడాదికి గాని రిలీజ్ కావు.

ఆ తరహాలో గత ఏడాది నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతోన్న సినిమా ఆచారి అమెరికా యాత్ర. ఎన్నో కామెడీ సినిమాలను చేసిన దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు. మంచు విష్ణు - ప్రగ్య జైస్వాల్ జోడిగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. అయితే ఎందువల్లనో కానీ ఈ ఆచారి గత ఏడాది వస్తానని చెప్పి ఇంకా రాలేదు. 2017 సెప్టెంబర్ 17న సినిమా రిలీజ్ అని చెప్పిన చిత్ర యూనిట్ ఆ సమయానికి మళ్లీ కనిపించలేదు. డిసెంబర్ లోపు వస్తుందని చెప్పారు. ఆ తరువాత సంక్రాంతి కానుకగా వస్తుంది అన్నారు. అయినా రిలీజ్ చేయలేదు. ఫైనల్ గా జనవరి 20 నుంచి 30 మధ్యలో కొన్ని తేదీలను చెప్పి ఆడియెన్స్ ని కన్ఫ్యూజ్ చేశారు.

చివరికి ఫిబ్రవరి లో కూడా రాలేదు. ఇక రీసెంట్ గా ఏప్రిల్ 5న రిలీజ్ అని ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ తేదీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది. ఫైనల్ గా ఏప్రిల్ ఆరు అని ఇప్పుడు పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. మరి ఈ తేదీ ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి లేట్ గా వచ్చినా మంచి హిట్ అందుకుంటారో లేదో చూడాలి.