Begin typing your search above and press return to search.

అబ్బాయి పుట్టాలన్నందుకు విష్ణు క్లాస్ పీకేశాడు

By:  Tupaki Desk   |   31 Dec 2017 4:23 PM IST
అబ్బాయి పుట్టాలన్నందుకు విష్ణు క్లాస్ పీకేశాడు
X
మంచు విష్ణు-విరోనికా దంపతులకు ఇప్పటికే అరియానా-వివియానా పేర్లతో ఇద్దరు కవల పిల్లలున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విరోనికా మరోసారి ప్రెగ్నెంట్ అయింది. ఇంకొన్ని రోజుల్లోనే ఆమె ప్రసవించబోతోంది. ఐతే విష్ణు దంపతులకు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలున్న నేపథ్యంలో ఈసారి అబ్బాయి పుట్టాలని వారి సన్నిహితులు కోరుకుంటున్నారట. ఇదే విషయం ప్రస్తావిస్తూ విష్ణుకు మెసేజులు పెడుతున్నారట. కొడుకు పుడితే వారసుడుంటాడని అంటున్నారట. దీనిపై అసహనంతో విష్ణు చిన్నపాటి క్లాస్ పీకాడు. వారసత్వానికి అమ్మాయి.. అబ్బాయి అనే తేడా లేదని.. తనకు ఈసారి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా తేడా ఏమీ లేదని అతనన్నాడు.

‘‘చాలామంది నాకు కొడుకు పుడితే వారసుడుంటాడు అని మెసేజెస్ పెడుతున్నారు. వాళ్లందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నాకు ఇద్దరు వారసురాళ్లు ఉన్నారు.. అరియానా - వివియానా. ఇంకొక అమ్మాయి పుడితే మూడో వారసురాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి.. అబ్బాయి తేడా లేదు’’ అని ట్విటర్లో మెసేజ్ పెట్టాడు విష్ణు. ఇక తనకు పుట్టబోయే మూడో బిడ్డ కోసం ఇప్పటికే రెండు జతల పేర్లను సిద్ధం చేసుకున్నట్లు విష్ణు తెలిపాడు. అందులో సగం అమ్మాయి పేర్లయితే.. సగం అబ్బాయి పేర్లని అన్నాడు. దీనిపై కొందరు సినీ ప్రముఖులు స్పందించారు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్న నేపథ్యంలో ఈసారి అబ్బాయి పుడతాడని.. తమకు విష్ణు లాంటి చోటా డిక్టేటర్ కావాలని రచయిత గోపీ మోహన్ అంటే.. తమకు జూనియర్ మోహన్ బాబు కావాలంటూ రచయిత.. దర్శకుడు గోపీ మోహన్ అన్నాడు.