Begin typing your search above and press return to search.

15 కేజీలు తగ్గిన మంచు హీరో.. ఇక ఫుల్‌ స్వింగ్‌

By:  Tupaki Desk   |   25 Dec 2020 11:21 AM IST
15 కేజీలు తగ్గిన మంచు హీరో.. ఇక ఫుల్‌ స్వింగ్‌
X
మంచు హీరో మనోజ్‌ వ్యక్తిగత కారణాల వల్ల కాస్త సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. ఆమద్య మనోజ్‌ పూర్తిగా సినిమాలను వదిలేస్తాడా అనే చర్చ కూడా జరిగింది. అలాంటి సమయంలో మంచు మనోజ్‌ అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించాడు. షూటింగ్‌ లకు దూరంగా ఉండటం ఇతర ఏవో కారణాల వల్ల వర్కౌట్ లకు దూరంగా ఉండటం వల్ల మంచు మనోజ్‌ బరువు బాగా పెరిగాడు. హెవీ వెయిట్‌ తో హీరోగా నటించడం కష్టం.. దానికి తోడు ఎబ్బెట్టుగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే మంచు మనోజ్‌ ఆయుర్వేదిక్‌ ఫుడ్‌ ను తీసుకుంటూ ఎక్కువ శారీరక శ్రమ పడి ఏకంగా 15 కేజీల బరువు తగ్గాడు. ఆయన బరువు తగ్గి సన్నగా అయిన పొటో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మంచు మనోజ్‌ కెరీర్‌ లో మళ్లీ బిజీ అవ్వబోతున్నాడు. ఇప్పటికే అహం బ్రహ్మాస్మి సినిమాను చేసేందుకు కమిట్‌ అయిన ఈ హీరో మరో రెండు సినిమాలను కూడా లైన్‌ లో పెడుతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021లో రెండు లేదా మూడు సినిమాలను మంచు అభిమానులకు మనోజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మంచు మనోజ్‌ బరువు తగ్గడంతో పాటు వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో కొన్ని సంఘటనలు జరిగితే వాటినే పట్టుకుని ఉండటం కంటే ఇలా మనోజ్‌ మాదిరిగా ఫుల్‌ స్వింగ్ లో పని చేసుకుంటూ ముందుకు వెళ్తే దాని నుండి బయట పడవచ్చు అంటున్నారు. ఈ విషయంలో మంచు మనోజ్‌ ను అంతా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. బరువు తగ్గి స్లిమ్‌ లుక్‌ లో ఆకట్టుకుంటున్న మంచు మనోజ్‌ హీరోగా కూడా సక్సెస్‌ అవ్వాలని ఆశిద్దాం.