Begin typing your search above and press return to search.

డైరక్ట్ కౌంటర్ ఇచ్చిన మనోజ్

By:  Tupaki Desk   |   8 Jun 2018 10:05 PM IST
డైరక్ట్ కౌంటర్ ఇచ్చిన మనోజ్
X
టాలీవుడ్ లో గత కొంత కాలంగా మంచు మనోజ్ వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న మనోజ్ - ప్రణతి దంపతులు ఇద్దరు విడాకులకు సిద్ధమయ్యారని కోట్లు మెట్లెక్కినట్టు కొన్ని సోషల్ మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. చాలా వరకు మనోజ్ ఫాలోవర్స్ ఇది నిజేమో లేదో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. ట్విట్టర్ లో చాలా మంది మనోజ్ ను ఈ విషయం గురించి అడిగారు. దీంతో మనోడు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

ఇదివరకే తన భార్యతో ఒక ఫోటో దిగి రూమర్స్ చెక్ పెట్టినా కూడా మళ్లీ అదే తరహాలో వైరల్ అవ్వడం మనోజ్ కి అసహనం తెప్పించింది. ఇక ఒక నెటిజన్ మీరు నిజంగా డివోర్స్ కి అప్లై చేశారా? కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో ఈ న్యూస్ పదే పదే వస్తోంది అని అడుగగా మనోజ్ "వాళ్ల బొంద" అంటూ కౌంట్ ఇచ్చాడు. దీంతో మనోజ్ ఫాలోవర్స్ కి మ్యాటర్ క్లియర్ గా అర్ధమయ్యింది. ఎలాంటి మనస్పర్థలు లేవని మనోజ్ ఆ డైలాగ్ తో చెప్పేశాడు.

సాధారణంగా ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇలాంటి రూమర్స్ అంతగా ఎండ్ అవ్వవు. అందుకే చాలా వరకు తారలు పట్టించుకోరు. ఎన్ని చెప్పినా అవి వస్తూనే ఉంటాయని ఒకటి చెబితే మరొకటి రాయడం కొన్ని మీడియాలకు అలవాటే అని తారలు సైలెంట్ గా ఉంటారు. కానీ మనోజ్ మొదట సైలెంట్ గా ఉన్నా ఆ తరువాత స్పందించక తప్పలేదు.