Begin typing your search above and press return to search.

మంచు మ‌నోజ్ రెండో పెళ్లి.. ఎమోజీల‌తో క‌న్ఫ్యూజ్ చేసిన హీరో!

By:  Tupaki Desk   |   8 March 2021 2:30 AM GMT
మంచు మ‌నోజ్ రెండో పెళ్లి.. ఎమోజీల‌తో క‌న్ఫ్యూజ్ చేసిన హీరో!
X
మోహ‌న్ బాబు వార‌సుడిగా తెరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన యాక్టింగ్ తో టాలీవుడ్లో స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మ‌నోజ్‌. ఈ మంచు హీరో సినీ లైఫ్‌ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఫ్యామిలీ లైఫ్ మాత్రం బ్రేక‌ప్ అయ్యింది. త‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్ర‌ణ‌తితో మూడేళ్లు తిర‌క్కుండానే విడిపోయాడు. త‌న‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చినందుకు చాలా కాలం కుంగిపోయాడు మ‌నోజ్‌.

తాను డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి త‌న ఫ్యామిలీ ఎంతో స‌పోర్ట్ చేసింద‌ని చెప్పాడీ హీరో. ఇక‌, ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకున్న త‌ర్వాత సినిమాల‌పై దృష్టిపెట్టాడు. ప్ర‌స్తుతం మ‌నోజ్ చేస్తున్న సినిమా ‘అహం బ్రహ్మస్మి’. ఈ సినిమా పనిలో మనోజ్ బిజీగా ఉండగా.. మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

త్వరలో మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకారు షికార్లు చేస్తోంది. ఈ వార్త తన వరకూ చేరడంతో లేటెస్ట్ గా స్పందించాడీ మంచు అబ్బాయి. ఇటీవల రిలీజ్ అయిన ‘జాతి రత్నాలు’ సినిమా ట్రైలర్ లో బ్రహ్మానందం వేసిన పంచ్ డైలాగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ల పెట్టి, ‘ డేట్ టైం కూడా మీరే చెప్పండి’ అంటూ ఫన్నీ ఎమోజీలను యాడ్ చేశాడు.

ఈ రియాక్షన్ ద్వారా.. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవట్లేదు అని క్లారిటీ ఇచ్చాడు మనోజ్. అదే సమయంలో.. తాను ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవట్లేదు అనికూడా చెప్పినట్టు కాదు. మరి, ఫైనల్ గా మనోజ్ ఏం చెప్పాడేది మాత్రం అతనికే తెలియాలి. కానీ.. ఒక్కటి మాత్రం వాస్తవం. జీవితంలో ఒక ద‌శ దాటిన త‌ర్వాత త‌ప్ప‌కుండా తోడు అవ‌స‌రం. ఇక‌, మ‌నోజ్ కు ఏజ్ అస‌లు స‌మ‌స్యే కాదు. కాబ‌ట్టి.. మంచు వారింట మ‌ళ్లీ పెళ్లిసంద‌డి నెల‌కొంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఏమంటారూ?