Begin typing your search above and press return to search.

అసలు సిస‌లు హీరోల్ని గుర్తించండి మ‌హాప్ర‌భో

By:  Tupaki Desk   |   21 May 2020 4:00 AM GMT
అసలు సిస‌లు హీరోల్ని గుర్తించండి మ‌హాప్ర‌భో
X
మ‌హ‌మ్మారీ విరుచుకుప‌డిన వేళ వెండితెర హీరోలు రియ‌ల్ హీరోలుగా మారారు. తిండికి లేక ఇబ్బందిప‌డుతున్న సినీకార్మికుల్ని.. సామాన్య ప్ర‌జ‌ల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. త‌మ‌వంతుగా నిత్యావ‌స‌రాల సాయం చేశారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు చోట్లా హీరోలు నిత్యావ‌స‌రాల పంపిణీ చేశారు. కొంద‌రు మీడియాని తిట్టుకున్నా.. ఎంతో ఒద్దిక‌గా ప్ర‌జ‌ల అవ‌స‌రం తెలుసుకుని సాయం చేసేందుకు కాస్త ఆల‌స్యంగా అయినా ముందుకొచ్చారు.

ఇలా సాయ‌ప‌డిన హీరోలంద‌రికీ కావాల్సినంత ప‌బ్లిసిటీ కూడా వ‌చ్చింది. ఇంత సాయం చేస్తే మీడియా అంత చేసార‌ని ప్ర‌చారం చేసి పెట్టింది. మంచిని మాన‌వ‌త్వాన్ని పెంపొందించేందుకు మీడియా న‌డుంక‌ట్టింది. హీరోల అస‌హ‌నాన్ని వెల్ల‌గక్కినా మంచిని మంచి అని చెప్పేందుకు మీడియాలు.. సోష‌ల్ మీడియాలు వెన‌కాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అదంతా స‌రే కానీ.... అస‌లు రియ‌ల్ హీరోయిజం అంటే ఏమిటో నిన్న బ‌ర్త్ డే జ‌రుపుకున్న మంచు మ‌నోజ్ చూపించారు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అత‌డు అన‌వ‌స‌ర ప‌బ్లిసిటీకి పోకుండా సాయం అంద‌క ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ‌ల‌స కూలీల్ని ఆదుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం ప్ర‌శంస‌నీయం. ప‌లువురు వ‌ల‌స‌కూలీల్ని వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించే ఏర్పాట్లు చేశారు మ‌నోజ్. ఇలాంటి ప్ర‌య‌త్నాల‌కు సోష‌ల్ మీడియాల్లో మ‌రింత ఎంక‌రేజ్ మెంట్ అవ‌స‌రం. కోట్లాది మంది నెటిజ‌నులు స్పందించి ఇలాంటివి ప్రోత్స‌హిస్తే మ‌రింత మంది హీరోలు ముందుకు వ‌చ్చి వ‌ల‌స కూలీల‌కు సాయం చేసే వీలుంటుందేమో. ఇప్ప‌టికే అటు బాలీవుడ్ లో సోనూసూద్ సొంత ఖ‌ర్చుల‌తో వల‌స కూలీల కోసం బ‌స్సులు ఏర్పాటు చేసి మంచి మెప్పు పొందారు. అదే తీరుగా .. హైద‌రాబాద్ స‌హా ప‌లు చోట్ల నుంచి వ‌ల‌స కూలీలు వంద‌లాది కిలోమీట‌ర్లు న‌డిచి వెళుతున్న వారికి మ‌న అగ్ర హీరోలు సాయం చేస్తే బావుంటుంద‌నే సూచిస్తున్నారు. ఇక ప్ర‌స్తుత స‌న్నివేశంలో వ‌ల‌స కూలీలే పెద్ద టాస్క్ గా మారింది. కేంద్రం ప‌ట్టించుకోదు. రాష్ట్రాలు అన్ని ఏర్పాట్లు చేయ‌లేవు. ఇలాంట‌ప్పుడే మ‌న హీరోలు తెగువ చూపాలి.