Begin typing your search above and press return to search.

ఇదేంటి మ‌నోజ్ బాబూ ఇంత ప‌ని చేశావ్?

By:  Tupaki Desk   |   20 Jan 2023 5:00 AM GMT
ఇదేంటి మ‌నోజ్ బాబూ ఇంత ప‌ని చేశావ్?
X
నిన్న‌టి నుంచి ఊరిస్తూ ఉన్నాడు. దోర జాంపండు చిల‌క్కొట్టు లాంటి వార్త అందిస్తాన‌న్నాడు! 9.45 ఏఎం ముస‌ళ్ల పండ‌గే. అదిరే శుభ‌వార్త చెబుతాను. మీర‌నుకున్న ఆ సంగ‌తే చెబుతాను! అంటూ అభిమానుల్ని టీజ్ చేశాడు మంచు మ‌నోజ్. ఇంకేం ఉంది త‌న కొత్త‌ గాళ్ ఫ్రెండ్ ని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడంటూ కథ‌నాలు అల్లేశాయి అన్ని మీడియాలు. కానీ ఇంత‌లోనే ట్విస్టు.

ఇదా మనోజ్ బాబూ నీ నిర్వాకం! అంటూ షాక్ తినేలా ఇప్పుడు ఒక 'వాట్ ది ఫిష్'ని జ‌నం మీదికి వ‌దిలాడు. డార్క్ కామెడీ -హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో న‌టిస్తున్నానంటూ చెప్పాడు. సినీ ప్రియులందరి కోసం హార్ట్-పంపింగ్.. యాక్షన్-ప్యాక్డ్ .. సైడ్-స్ప్లిటింగ్ లీ అనిపించే ఎగ్జ‌యిటింగ్ రైడ్ ని అందిస్తామ‌ని తెలిపారు. సీటు అంచున కూచుని చూసేంత‌టి పాన్ ఇండియా ఎంట‌ర్ టైన‌ర్ ని అందిస్తున్నాం! అంటూ మ‌నోజ్ అండ్ టీమ్ ఆ శుభ‌వార్త‌ను కాస్తా చెప్పారు.

6 సంవత్సరాల పాటు సుదీర్ఘ‌ విరామంలో ఉన్న మంచు మనోజ్ ఇప్పటికి కొత్త సినిమాని ప్ర‌క‌టించాడు. గతంలో కంటే ఎక్కువ శక్తితో తిరిగి వస్తున్నాడని టీమ్ చెబుతోంది. 'వాట్ ది ఫిష్' అనే క్యాచీ టైటిల్ ని ఎంపిక చేసుకుని భారీ ఎంట‌ర్ టైన‌ర్ కి ''మనం మనం బరంపురం'' అనే ఫ‌న్నీ ట్యాగ్ లైన్ ని టీమ్ ఎంపిక చేసుకుంది. ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ప్లే రాసి మెగాఫోన్ ను చేప‌డుతున్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు వ‌రుణ్ క్లాసీ పోస్ట‌ర్ తో ఆస‌క్తిని పెంచాడ‌ని చెప్పాలి.

ప్రకటన పోస్టర్ యూనివ‌ర్శ‌ల్ లుక్ తో ఆక‌ట్టుకుంది. పోస్టర్ తోనే మూవీ థీమ్ ఏంటో వెల్ల‌డైంది. మనోజ్ స‌హ‌జంగానే చాలా చమత్కారమైన కుర్రాడు. ఈ పోస్టర్ లో అంత‌కంటే ఛ‌మ‌క్కులా క‌నిపించాడు. చుట్టూ భ‌యంక‌ర‌మైన విదేశీ గూండాలు డాన్ లు క‌నిపిస్తుంటే అంద‌రినీ ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్న హీరో గారు పిడికిలి బిగించి బ్యాక్ ఫీట్ లో క‌నిపించాడు. ఇందులో పోరాటాల్ని రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా డిజైన్ చేస్తున్నార‌ని కూడా భావించవ‌చ్చు.

ఈ పోస్ట‌ర్ లో గాగుల్ మాస్క్ తో ఉన్న ఆ అమ్మాయి ఎవరో కానీ వింత‌గానే క‌నిపించింది. ఇదేమైనా వీడియో గేమ్ స్ఫూర్తితో రూపొందిస్తున్న రియాలిటీ స్టోరీ కాదు క‌దా? అనే సందేహాన్ని కూడా ఈ పోస్ట‌ర్ రైజ్ చేసింది. అయ‌తే మ‌నోజ్ బ్యాక్ పోజ్ లో ఫిట్ గా కనిపిస్తున్నాడు. అత‌డు ఈ మూవీ కోసం చాలా మేకోవర్ ట్రై చేసాడు. ఈ కొత్త గెటప్ అస‌లు రూపం ఎలా ఉండ‌బోతోందో చూడటానికి మరికొంత సమయం ప‌డుతుంద‌ని టీమ్ చెబుతోంది.

సెట్ లో మ‌నోజ్ ఎన‌ర్జీ ప్ల‌స్. అత‌డి నుంచి స్పెష‌ల్ పార్టీ లాంటి సినిమాని ఆశించ‌వ‌చ్చు! అంటూ చిత్ర‌బృందం మ‌రింత క్యూరియాసిటీని పెంచుతోంది. డార్క్ కామెడీ -హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జాన‌ర్ లో విజువల్ గా క‌డుపుబ్బా న‌వ్వుకునేలా గ‌గుర్పొడిచే యాక్ష‌న్ తో హార్ట్ థ్రోబింగ్ మూవీ గా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసింది.

ఇది మంచు మ‌నోజ్ కి పాన్ ఇండియా ప్ర‌య‌త్నం. ''అంతర్జాతీయంగా సాంస్కృతికంగా మిళిత‌మై ఉండే ఇండియా స్టైల్ కంటెంట్ ని తెర‌పై చూపించే ప్ర‌య‌త్న‌మిది'' అని దర్శకుడు వరుణ్ అన్నారు. ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ అందమైన టొరంటో నగరం లో అలాగే కెనడాలోని ప‌లు అంద‌మైన ప్రదేశాలలో 75 రోజుల పాటు జరగనుంది. ఈ సినిమాకి ప‌ని చేసే తెలుగు నటీనటులు.. ప్ర‌పంచ ప్రఖ్యాత నటీనటులు.. ఇత‌ర‌ సిబ్బందికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

వాట్ ది ఫిష్ అద్భుతమైన అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా అల‌రిస్తుంద‌ని టీమ్ వెల్ల‌డించింది. అత్యున్న‌త‌ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పాన్-ఇండియా కేట‌గిరీలో ప‌లు భాష‌ల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామ‌ని వారు తెలిపారు. ఏ ఫిలిమ్ బై వీ స‌మ‌ర్ప‌ణ‌లో 6ix సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.