Begin typing your search above and press return to search.

టంగ్ స్లిప్ అయిన మంచు అబ్బాయి

By:  Tupaki Desk   |   29 Jan 2018 3:41 PM IST
టంగ్ స్లిప్ అయిన మంచు అబ్బాయి
X
మంచు వారి వేడుక ఏదైనా జరిగితే వేడుకలో పొగడ్తలు తప్పా ఏమి కనిపించవు అనే టాక్ ఒకటి బాగా వస్తుంటుంది. సాధారణంగా అన్ని ఆడియో వేడుకల్లో అలానే ఉంటుంది అనుకోండి. కాకపోతే మంచు వారి వేడుకలో అయితే ఆ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వారి కుటుంబంలోని వారు ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచేయడం హైలెట్ గా నిలుస్తుంటుంది. అయితే నిన్న గాయత్రీ ఆడియో వేడుకలో కూడా మోహన్ బాబును వారి పిల్లలు ఓ రేంజ్ లో పొగిడేశారు.

అయితే అందరికంటే కొంచెం లిమిట్ లో మనోజ్ మాట్లాడాడు. కానీ ఆ లిమిట్ లోనే ఒక చిన్న మాటతో టంగ్ స్లిప్ అయ్యాడు. ఇష్టమైన హీరోయిన్ ని ఘాటైన కుర్రకారు పర్సనల్ గా ఎలా ఉహించుకుంటారో అలాగే మనోజ్ కూడా అభిప్రాయపడ్డాడు. నేను ఎప్పటి నుంచో శ్రియ కి పెద్ద ఫ్యాన్ ని అంటూ శ్రియ ఈ సినిమాలో అదరహో..నువ్వు నిజంగా హాట్ అండ్ సూపర్ అనేశాడు. మనోజ్ చెబుతున్న సమయంలో అందరు సైలెన్స్ గా ఉన్నారు. ఆ తరువాత కొంత మంది అరవడంతో ఎదో బిస్కెట్ వేసుకుంటున్నా అని అనడం అక్కడ అందరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహన్ బాబు డిఫెరెంట్ రోల్ లో కనిపించనున్నారు. ఇక మంచు విష్ణు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.