Begin typing your search above and press return to search.

హ‌త్యాచార ఘ‌ట‌న‌పై మంచు హీరో ఫైరింగ్

By:  Tupaki Desk   |   3 Oct 2020 10:45 AM IST
హ‌త్యాచార ఘ‌ట‌న‌పై మంచు హీరో ఫైరింగ్
X
ఆడ‌వాళ్ల‌కు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దేశాల లిస్ట్ లో ఇండియా ముందు వ‌రుస‌లో నిలుస్తోందన్న‌ది తాజా స‌ర్వే. 2018 లో ఓ సంస్థ చేసిన స‌ర్వేలో `మోస్ట్ డేంజ‌ర‌స్ కంట్రీస్ ఫ‌ర్ ఉమెన్` అనే స‌ర్వేలో మ‌న దేశం ప్ర‌ధ‌మ స్థానంలో నిలిస్తే అఫ్గ‌న్- పాక్‌- సిరియా త‌రువాతి స్థానా‌ల్లో నిలిచాయి. దీన్ని బ‌ట్టే మ‌న దేశంలో రోజు రోజుకీ ఉమెన్ హెరాస్ ‌మెంట్ ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని హ‌థ్రాస్ గ్యాంగ్ రేప్ సంఘ‌ట‌న భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తోంది.

దీనిపై సామాన్యు‌ల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బాధితురాలికి అండ‌గా నిలుస్తున్నారు. హ‌థ్రాస్ ఘ‌ట‌న‌లో దారుణంగా అత్యాచారానికి గురై హ‌త్య చేయ‌బ‌డిన అమ్మాయిని అక్క‌డి పోలీసులు అర్థ్ర‌రాత్రి ద‌హ‌నం చేయ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై యంగ్ హీరో మంచు మ‌నోజ్ ఘాటుగా స్పందించారు.

ఆడ‌ది అర్థ్ర రాత్రి నిర్భ‌యంగా తిరగ‌గ‌లిగిన‌ప్పుడే దేశానికి అస‌లైన స్వాతంత్య్రం వ‌చ్చిన‌ట్ట‌ని బాపూజీ అన్నారు. కానీ ప‌ట్ట‌ప‌గ‌లే అత్యాచారాలు జ‌రుగుతున్న‌ప్పుడు ఏడాదికోసారి గాం‌ధీ జ‌యంతి సెల‌విచ్చి శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డంలో అర్థ‌మేముంది. మ‌న‌కి బాపూ క‌రెన్సీ మీద ఒక డిజైన్ మాత్ర‌మే..‌. ప్ర‌తి ఏడాది ఒక‌ రోజు సెల‌విచ్చే వారం. ఆ రోజు మందు దొర‌క‌కుండా చేసే ఒక శాపం.... అంతేగా మారుదాం బాస్ ప్లీజ్‌` అని మంచు మ‌నోజ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ని వ్య‌క్తం చేశారు.