Begin typing your search above and press return to search.

అటాక్ రిలీజ్ ఆగలేదు.. ఆపారట

By:  Tupaki Desk   |   4 March 2016 10:58 AM IST
అటాక్ రిలీజ్ ఆగలేదు.. ఆపారట
X
రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతుంటాయి. కానీ అవి ఎప్పుడు రిలీజవుతాయన్నదే తెలియదు. పట్టపగలు, సీక్రెట్, అటాక్.. ఇలా ఫస్ట్ కాపీ రెడీ అయి రిలీజ్ కు నోచుకోని వర్మ చిత్రాల జాబితా పెరిగిపోతూ వస్తోంది. ఐతే ఇందులో మొదటి రెండు సినిమాల మీద జనాలకు పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి.. వాటి సంగతలా వదిలేద్దాం. కానీ మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు నటించిన ‘అటాక్’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం జనాలు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. దీని ట్రైలర్ రిలీజై కూడా ఆరేడు నెలలవుతోంది. అయినా సినిమా ఎందుకు రిలీజవ్వట్లేదో జనాలకు అంతు బట్టట్లేదు.

ఐతే ఈ సందేహాలకు మంచు మనోజే స్వయంగా సమాధానమిచ్చాడు. ‘అటాక్’ రిలీజ్ ఆగిపోలేదని.. తామే ఆపామని చెప్పాడు మనోజ్. ‘‘అటాక్ సినిమా పూర్తవుతున్న సమయానికే ‘శౌర్య’ మూవీ తెరమీదికి వచ్చింది. సినిమా పూర్తయింది. ఔట్ పుట్ చాలా బాగా రావడంతో సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ముందు శౌర్య సినిమానే రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యాం. ఈ సినిమా విజయవంతమైతే.. దాని వల్ల ‘అటాక్’ చాలా మేలు జరుగుతుందనిపించింది. అందుకే దాన్ని ఆపి.. దీన్ని రిలీజ్ చేస్తున్నాం. అటాక్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చెప్పాడు మనోజ్. మంచు వారబ్బాయి కాన్ఫిడెన్స్ బాగానే ఉంది కానీ.. సినిమా రిజల్ట్ ఏమైనా తేడా వస్తే ఏం చేస్తారో మరి?