Begin typing your search above and press return to search.

మంచు 'అహం బ్రహ్మాస్మి' లో మరో హీరో?

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:33 AM GMT
మంచు అహం బ్రహ్మాస్మి లో మరో హీరో?
X
మంచు హీరో మనోజ్‌ 2017 లో ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మనోజ్ కొత్త సినిమా వచ్చిందే లేదు. గత ఏడాది మనోజ్‌ అహం బ్రహ్మాస్మి అనే భారీ సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా లో మనోజ్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉండబోతుందని.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు. కరోనా కారణంగా ఈ సినిమా ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగా మారింది. మంచు మనోజ్‌ ఎట్టకేలకు సినిమాను మొదలు పెట్టాడు అనుకుంటూ ఉన్న సమయంలో సినిమా కు కరోనా పదే పదే అడ్డు తగులుతూనే ఉంది. అహం బ్రహ్మాస్మి సినిమా కోసం మంచు అభిమానులు మాత్రమే కాకుండా సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ టైటిల్‌ మరియు ఇప్పటికే విడుదలైన ఓ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి. గత కొన్ని నెలలుగా సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక పుకారు సోషల్‌ మీడియాలో షికారు చేయడం మొదలు పెట్టింది.

మంచు మనోజ్‌ అహం బ్రహ్మాస్మి సినిమాలో కీలక పాత్రను అల్లరి హీరో నరేష్‌ పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కామెడీ సినిమాలు.. కామెడీ పాత్రలు చేస్తూ వచ్చిన నరేష్‌ నాందితో ఒక కొత్త ఒరవడిని మొదలు పెట్టాడు. తనను జనాలు కొత్తగా చూడబోతున్నారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నరేష్‌ అన్నారు. అన్నట్లుగానే నాందిలో సీరియస్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు అహం బ్రహ్మాస్మి సినిమాలో కూడా విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అహం బ్రహ్మాస్మిలో అల్లరి నరేష్‌ పాత్ర అత్యంత విభిన్నంగా ఉంటుందని.. నాందిని మించిన సీరియస్ నెస్ తో పాత్ర సాగుతుందని అంటున్నారు. ప్రస్తుతం సైలెంట్‌ గా షూటింగ్ ను జరిపేస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులు త్వరలోనే కీలక అప్‌ డేట్‌ ను ఇస్తారనే సమాచారం అందుతోంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు అనఫిషియల్‌ గా మాట్లాడుతూ మంచు మనోజ్‌ పాత్ర తర్వాత సినిమా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్నారు. ఆయన నటన ఈ సినిమాలో పీక్స్ లో ఉంటుందని.. కొత్త నరేష్‌ ను చూస్తారని చాలా నమ్మకంగా వారు చెబుతున్నారు. హీరోగా సుదీర్ఘ కాలం చేసిన అల్లరి నరేష్‌ ఈమద్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. మహర్షి సినిమాలో మహేష్‌ బాబు కు స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ నటించి మెప్పించాడు. ఒక వైపు హీరోగా మరో వైపు ఇలా కీలక పాత్రల్లో నటిస్తూ అల్లరోడు నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అహం బ్రహ్మాస్మి లో మనోజ్‌ తో పాటు అల్లరి నరేష్‌ ఉండటం వల్ల ఖచ్చితంగా వెయిట్‌ పెరగడం ఖాయం.

ఇప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరగడం కూడా చాలా కామన్‌ అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌ రెడ్డి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో మంచు మనోజ్ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా ను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు తో పాటు పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే సినిమా కథను మరియు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా అన్ని భాషల వారికి అనుగుణంగా అంటే యూనివర్శిల్‌ అప్పీల్ తో సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. అహం బ్రహ్మాస్మి తో మనోజ్‌ ఈ అయిదు ఏళ్ల గ్యాప్‌ ను ఫిల్‌ చేస్తాడేమో చూడాలి.