Begin typing your search above and press return to search.

మంచు మనోజ్ సినిమా ఏమైంది?

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:12 AM GMT
మంచు మనోజ్ సినిమా ఏమైంది?
X
టాలీవుడ్లో మంచు మనోజ్ అనే నటుడొకరు ఉన్న సంగతే జనాలు మరిచిపోయారు. అత‌డి చివ‌రి సినిమా 'ఒక్కడు మిగిలాడు' విడుద‌లై ఐదేళ్లు కావ‌స్తోంది. ఆ సినిమా త‌ర్వాత రెండేళ్లు అస‌లు కొత్త సినిమా ఊసే ఎత్త‌లేదు మ‌నోజ్. క‌రోనాకు ముందు, 2019లో అత‌ను త‌న కొత్త సినిమా గురించి మాట్లాడాడు. ఆ త‌ర్వాత కూడా అత‌ను చాలా టైం తీసుకుని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తూ 'అహం బ్రహ్మాస్మి'. అనే సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీని కోసం మంచు మనోజ్ తనను తాను కొత్తగా మార్చుకున్న లుక్.. పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. కొత్తగా పెట్టిన తన బేనర్ 'మంచు మనోజ్ ఆర్ట్స్' బేన‌ర్ మీద‌ మీద తన తల్లితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు లాంచింగ్ టైంలో ప్ర‌క‌టించాడు మ‌నోజ్. ఐతే ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాత సినిమా గురించి ఏ ఊసూ లేదు.

అస‌లు అహం బ్ర‌హ్మాస్మి సినిమా సెట్స్ మీదికి వెళ్లిందో లేదో తెలియ‌దు. మ‌నోజ్ అస‌లేం చేస్తున్నాడో తెలియ‌దు. రెండేళ్ల‌కు పైగా ఈ సినిమా అస‌లు చ‌ర్చ‌ల్లోనే లేదు. స్క్రిప్టు విష‌యంలో చాలా ఎగ్జైట్ అయి పాన్ ఇండియా సినిమాగా దీన్ని చేయాల‌ని ఉత్సాహం చూపించిన మ‌నోజ్.. త‌ర్వాత సినిమాను ఎందుకు వార్త‌ల్లోకి తీసుకురాలేక‌పోయాడో అర్థం కావ‌డం లేదు. మంచు ఫ్యామిలీ కొత్త‌ జ‌న‌రేష‌న్లో యూత్‌లో కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ది మ‌నోజే.

ఒక ద‌శ‌లో అత‌ను అడ‌పా ద‌డ‌పా హిట్లు కొడుతూ కెరీర్‌ను బాగానే న‌డిపించాడు. కానీ త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాలు అత‌ణ్ని వెన‌క్కి లాగేశాయి. దీనికి తోడు వైవాహిక జీవితం విఫ‌ల‌మ‌వ‌డంతో మ‌నోజ్ కెరీర్లో గ్యాప్ మ‌రింత పెరిగేలా చేసింది. అన్ని అడ్డంకులనూ దాటి ఘ‌నంగా రీఎంట్రీ మూవీని ప్ర‌క‌టించ‌నైతే ప్ర‌క‌టించాడు కానీ.. దాన్ని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయాడు. ఈ సినిమా ఆగిపోయింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారానికి మ‌నోజ్ తెర‌దించుతాడేమో చూడాలి.