Begin typing your search above and press return to search.

ఏది జ‌రిగినా నువ్వు నీలానే ఉండు!

By:  Tupaki Desk   |   21 Dec 2019 9:56 AM GMT
ఏది జ‌రిగినా నువ్వు నీలానే ఉండు!
X
మ‌నోజ్ లేటెస్టుగా త‌న మేకోవ‌ర్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. ``నాలోని ఎన్నో భ‌యాల‌తో పోరాడి ఈ ప‌య‌నాన్ని సాగించాను. ఈ ఏడాదిని మంచి మాట‌తో ముగిస్తున్నా. 2020లో కొత్త విష‌యాన్ని ప్ర‌క‌టించేందుకు వేచి చూడ‌లేక‌పోతున్నా!! ఏది జ‌రిగినా నువ్వు నీలానే ఉండు! `` అంటూ సోష‌ల్ మీడియాలో ఓ కొత్త ఫోటోని షేర్ చేశాడు మంచు మ‌నోజ్.

అంతేకాదు ఈ ఫోటోలో మ‌నోజ్ ధ‌రించిన ఆ క‌ళ్ల‌జోడు .. ఫ్రెండు నుంచి నొక్కేశాడ‌ట‌. ఆ విష‌యాన్ని త‌నే కాస్త ఊర‌మాస్ స్టైల్లో ఎంతో ఎన‌ర్జిటిక్ గా చెప్పాడు. పాత భ‌యాల్ని వ‌దిలేశాడు కాబ‌ట్టి కొత్త సంవ‌త్స‌రంలోకి కొత్త‌గానే అడుగు పెడుతున్న మ‌నోజ్ సినీకెరీర్ వెల‌గాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మంచు మ‌నోజ్ వ్య‌క్తిగ‌త జీవితంలోని క‌ల‌త‌ల్ని వీడి స్వేచ్ఛ‌గా ఇక‌పై సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఓ కొత్త ద‌ర్శ‌కుడి స్క్రిప్టును ఫైన‌ల్ చేసి ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాడు. కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే ఇక‌ ఆలస్యం.