Begin typing your search above and press return to search.

మంచు వారికి ఉన్న జ‌బ్బు అదే!

By:  Tupaki Desk   |   7 March 2019 12:22 PM GMT
మంచు వారికి ఉన్న జ‌బ్బు అదే!
X
ప‌రిశ్ర‌మ‌లో క్ర‌మ‌శిక్ష‌ణ గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతుంటుంది. అలా ప్ర‌స్థావిస్తే ఆ రోజుల్లో అన్న‌గారు ఎన్టీఆర్.. ఆ త‌ర్వాత మంచు మోహ‌న్ బాబు అని చెబుతుంటారు. ఇదే విష‌యం మ‌రోసారి ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. క్ర‌మ‌శిక్ష‌ణ కేవ‌లం మంచు మోహ‌న్ బాబుకే కాదు.. మా కుటుంబానికి ఉన్న జ‌బ్బు! అంటూ మంచు ల‌క్ష్మి చేసిన వ్యాఖ్య ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``టైమ్‌ కు సెట్స్ కి రావడం నాకు అలవాటు. మా ఫ్యామిలీలో కూడా ఇది అందరూ పాటిస్తారు. ఇది మంచు వారికి ఉన్న ఓ జబ్బు!!`` అని మంచు లక్ష్మి ఓ కార్య‌క్ర‌మంలో నొక్కి చెప్ప‌డం వేడెక్కించింది. టైమ్‌ ను పాటించడం మాకు వారసత్వంగా వచ్చిందని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న అన్నారు.

సినిమా.. టీవీ రంగాల్లో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్న మంచు ల‌క్ష్మి ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ తో తెలుగు లోగిళ్ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. `మిసెస్ సుబ్బ‌ల‌క్ష్మి` అనేది ఈ వెబ్ సిరీస్ టైటిల్. తాజాగా ఈ ప్ర‌య‌త్నానికి సంబంధించి హైద‌రాబాద్ తాజ్ లో జ‌రిగిన‌ సమావేశంలో చిత్రం శ్రీ‌ను - మంచు ల‌క్ష్మి మ‌ధ్య సాగిన స‌ర‌దా సంభాష‌ణ‌లో మంచు వారి అల‌వాటు ప్ర‌స్థావించ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. ఈ సిరీస్‌ కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ను మీడియా ముందు ప్రదర్శించారు.

`మిసెస్ సుబ్బలక్ష్మి` నేను న‌టిస్తున్న తొలి వెబ్ సిరీస్‌. ఈ సిరీస్ మార్చి నుంచి జీ5 ఛానెల్‌ లో ప్రసారం అవుతుంది. భార్య, భర్త మధ్య జరిగే కథతో ఈ వెబ్ సిరీస్ ఆద్య ంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని ల‌క్ష్మీ మ ంచు తెలిపారు. కెరీర్ కి కీల‌క‌మైన మ‌లుపు ఇద‌ని అన్నారు. ఇక మంచు ల‌క్ష్మి గురించి చిత్రం శ్రీ‌ను ప్ర‌స్థావిస్తూ.. నాకు మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. విష్ణుతో కలిసి నటించాను. మోహన్‌ బాబు గారిని బర్త్ డే ఫంక్షన్‌లో కలిశాం. అయితే మంచు లక్ష్మీతో కలిసి నటించ‌లేదు. ఈ వెబ్‌ సిరీస్‌ లో అవ‌కాశం ఇచ్చిన ల‌క్ష్మీ గారికి ధ‌న్య‌వాదాలు అన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఓ వారం పాటు పనిచేశాను. ప్రతీ రోజు మంచు లక్ష్మి కంటే ముందు రావాలని అనుకోనేవాడిని. ఏ రోజూ అలా చేయలేకపోయాను. నేను వచ్చే సరికి సెట్‌ లో మంచు లక్ష్మి రెడీగా ఉండేవారు .. ఆ క్ర‌మ‌శిక్ష‌ణ‌.. స‌మ‌య‌పాల‌న త‌న నుంచి నేర్చుకోవాల్సిందేన‌ని అన్నారు.