Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి మేకప్ లేకుండా..

By:  Tupaki Desk   |   1 May 2018 4:25 AM GMT
మంచు లక్ష్మి మేకప్ లేకుండా..
X
మోహన్ బాబు కుమార్తెగానే కాకుండా యాంకర్ గా.. యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. తనకు నచ్చిన పాత్రలు వచ్చినప్పుడు మాత్రం సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా మంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమా చేస్తోంది. కొత్త డైరెక్టర్ విజయ్ ఏలకంటి ఈ మూవీకి దర్శకుడు. ఇందులో మంచు లక్ష్మి ఓ హౌస్ వైఫ్ రోల్ ఛేస్తోంది.

ఓ సాధారణ గృహిణి భర్త మరణంతో దిగాలు పడుతోంది. తన భర్తను కావాలని హత్య చేశారని తెలుసుకుంటుంది. దాని వెనుక మిస్టరీని ఏమిటనేది ఛేదించి తెలుసుకునే పాత్రను మంచు లక్ష్మి చేస్తోంది. ఈ మూవీలో ఆమెది డీ గ్లామర్ రోల్. అందుకే ఈ పాత్ర కోసం ఎలాంటి మేకప్ లేకుండా కనిపించనుంది. తన కెరీర్ లో చేసిన అన్ని పాత్రలో అత్యంత కష్టమైనది ఇదేనంటోంది మంచు లక్ష్మి. ఈ సినిమా స్క్రిప్ట్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు డైరెక్టర్ విజయ్.. తాను చాలా వర్క్ చేశామని మంచి లక్ష్మి చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో మంచు లక్ష్మితో పాటు యాక్టర్ ప్రియదర్శి ఇంకో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. విశ్వప్రసాద్ తో కలిసి మంచు లక్ష్మి స్వయంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. వైఫ్ ఆఫ్ రామ్ తనకు ఛాలెంజింగ్ రోల్ కావడం వల్లే నటించడంతోపాటు ఈ సినిమాను తాను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నానని మంచు వారమ్మాయి అంటోంది. ఇంతకుముందు ఆమె గుండెల్లో గోదారి సినిమాలో ఓసారి డీగ్లామర్ రోల్ చేసింది. ఆ మూవీ బాక్సాఫీసును పెద్దగా ఆకట్టుకోలేదు.