Begin typing your search above and press return to search.

ది మంచు లక్ష్మి ఎఫెక్ట్: ఫస్ట్ సంచలనం ఇదే

By:  Tupaki Desk   |   4 Oct 2019 6:48 AM GMT
ది మంచు లక్ష్మి ఎఫెక్ట్: ఫస్ట్ సంచలనం ఇదే
X
హిందీలో 'కాఫీ విత్ కరణ్'.. 'నో ఫిల్టర్ విత్ నేహ' లాంటి బోల్డ్ చాట్ షో ల తరహాలో తెలుగులో 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో స్టార్ట్ అయిందన్న విషయం తెలిసిందే. ఈ షోకు డైనమిక్ లేడీ మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రోమోస్ లోనే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ బోల్డ్ షో ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ చాట్ షో కు స్టార్ హీరోయిన్ సమంతా అతిథిగా హాజరైన ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. అంతే.. ఒక సంచలనం నమోదైంది.

సాధారణంగానే సమంతా బోల్డ్. ఇక మంచు లక్ష్మి ప్రశ్నలు అడగడం.. సమంతా చెప్పకపోవడమూ ఉంటాయా? ఇద్దరు పవర్ఫుల్ లేడీస్ మాటల్లో సామ్ ఓ పెద్ద సీక్రెట్ ను బయటపెట్టేసింది. సమంతా.. నాగ చైతన్య గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాతే ఇరు కుటుంబాల అనుమతితో వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళికి ముందు లవ్ లో ఉన్నారని మాత్రమే అందరికీ తెలుసు. కానీ సమంతా "మేము పెళ్ళికి ముందు లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నాం" అంటూ బాంబు పేల్చింది. ఇది అందరికీ పెద్ద షాకేనని చెప్పాలి. లివిన్ రిలేషన్ గురించి బయటకు చెప్పే ధైర్యం మన సౌత్ లో దాదాపుగా ఎవరికీ ఉండదు. ఇండస్ట్రీలో ఏ కొద్దిమందికో తప్ప ఎవరికీ తెలియని రహస్యాన్ని సమంతా వెల్లడించడంతో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.

అంతే కాదు. సమంతా మరో సీక్రెట్ ను వెల్లడించింది. చైతు తనకంటే ముందుగా మరొకరిని పెళ్ళి చేసుకున్నాడట. ఎవరంటే.. బెడ్ పైన ఉండే దిండు.. అని చెప్పింది. బెడ్ పై మేమిద్దరం హగ్ చేసుకోవాలంటే ఆ పిల్లో అడ్డం వస్తుందని చెప్పిన అక్కినేని కోడలు పిల్ల పకపకా నవ్వేసింది. మరి ఇలాంటి షాకింగ్ విషయాలు వెల్లడిస్తారు కాబట్టే దాన్ని బోల్డ్ షో అంటారు. ఏంటో.. ఈ మంచు లక్ష్మి అక్క.. అందరి రహస్యాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటేవరకూ నిద్రపోయేలా లేదు.