Begin typing your search above and press return to search.
లక్ష్మీ మంచు కూడా రిజక్ట్ చేసిందా??
By: Tupaki Desk | 26 Oct 2016 9:33 AM IST'నేను బాహుబలిని రిజక్ట్ చేశా' అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ తరహాలో మారిపోయింది. దాదాపు అందరూ అలా చెప్పుకోవడమే ప్రెస్టీజియస్ అనుకుంటున్నారేమో తెలియదు కాని.. మొన్నామధ్యన హీరోయిన్ సోనమ్ కపూర్.. నాకు బాహుబలిలో హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారు కాని.. తెలుగు రాదు కాబట్టి రిజక్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ మంచు లక్ష్మి కూడా అలాగే చెబుతుందండోయ్. అయితే అమ్మడికి కూడా హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారా? ఆపండి మీ పరాచికాలు!!
నిజానికి శివగామి రోల్ కోసం ఒరిజినల్ గా రాజమౌళి ఎవరిని అనుకున్నాడో తెలుసా? ఆయన ఎవరిని అనుకున్నాడో తెలియదు కాని.. అందుకు నన్నే అనుకున్నారు అంటోంది లక్ష్మీ మంచు. ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. తనకు శివగామి రోల్ ఆఫర్ చేయగా.. అసలు ప్రభాస్ కు తల్లి పాత్ర అంటే చాలా సిల్లీగా అనిపించిందని.. అందుకే తాను ఆ పాత్రను చేయలేదని అంటోంది అమ్మడు. గతంలో మాత్రం శ్రీదేవి అండ్ టబూ ఈ పాత్రను రిజక్ట్ చేశారని తెలుసుగాని.. ఇప్పుడు లక్ష్మీ మంచు కూడా రిజక్ట్ చేసిందంటే మాత్రం కాస్త వింతగానే ఉంది. ఆ పాత్రను ఆమె చేసుంటే ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్ళేదేమో.
అంతేలేండి.. అదృష్టం అంతా రమ్యకృష్ణ నుదుటన రాసుంటే.. ఎవరికో ఆ రోల్ ఎందుకు దక్కుతుంది. పాపం లక్ష్మి బ్యాడ్ లక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/