Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మంచువారమ్మాయ్ కేకలే

By:  Tupaki Desk   |   1 Oct 2016 4:40 AM GMT
ఫోటో స్టోరి: మంచువారమ్మాయ్ కేకలే
X
ఇప్పటివరకు అస్సలు హాట్నెస్ అనే యాంగిల్ జోలికి పోకుండా.. ఎంతసేపూ కూడా మోడ్రన్ గా కనిపించినా కూడా కాస్త పొదుపుగానే గ్లామరసాన్ని పండిస్తూ వచ్చింది మంచు లక్ష్మి. నటిగాకంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ గా వ్యాఖ్యాతగానే రాణించింది కాబట్టి.. ఈ హాట్ లుక్స్ తో పెద్దగా పనిపడలేదు.

కాని ఇప్పుడు రూటు మార్చుదాం అనుకుందో ఏమో గాని.. మంచువారమ్మాయ్ కూడా కంచెలు తెంచేసి కాస్త హాటుగానే దర్శనమిస్తోంది. శుక్రవారం సడన్ గా లక్ష్మీ పి.ఆర్.ఓ దగ్గర నుండి వచ్చిన ఒక మెయిల్ అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిందంతే. సడన్ గా తనలోని సెక్సీ యాంగిల్ ను ఆవిష్కరిస్తూ ఆ మ్యారీడ్ హాటీ ఒక ఫోటో షూటుతో దిగిపోయింది. ఎలా చూసినా కూడా అమ్మడు పిచ్చెత్తించిందనే చెప్పాలి. కాస్త మెట్యూర్డ్ లుక్స్ కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడున్న హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోయే గ్లామర్ అండ్ ఫిగర్ కాదనే అనాలి.

ఇకపోతే కొత్తగా కనిపిస్తున్న భుజం మీది టాటూలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఈ రేంజులో ఫోటో షూటులో కేకలు పెట్టిస్తే సరే.. మరి సినిమాల్లో కూడా ఇదే గ్లామర్ దారబోస్తే మాత్రం తట్టుకోవడం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/