Begin typing your search above and press return to search.

భ‌యాన‌క ప‌రిస్థితుల్లో...మంచు ల‌క్ష్మి!

By:  Tupaki Desk   |   6 July 2018 2:48 PM GMT
భ‌యాన‌క ప‌రిస్థితుల్లో...మంచు ల‌క్ష్మి!
X
మంచు ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపును సంపాదించుకున్న న‌టి మంచు ల‌క్ష్మి. త‌న మొద‌టి సినిమాతోనే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సైతం అందుకున్న ల‌క్ష్మి....ఆ తర్వాత ప‌లు విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. తాజాగా, మంచు ల‌క్ష్మి....`వైఫ్ ఆఫ్ రామ్ `సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నెల 20న ఆ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మంచు ల‌క్ష్మి లీడ్ రోల్ చేస్తోన్న ఆ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుదలైంది. ఆ ట్ర్రైల‌ర్ లో మంచు ల‌క్ష్మి న‌ట‌న...సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించేలా ఉంది. ఆ ట్రైలర్ కు - ల‌క్ష్మి ప‌ర్ ఫార్మ‌న్స్ కు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ చిత్రం ఆస‌క్తి రేకెత్తిస్తోంద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజమౌళి ప్ర‌శంసించారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఒక సైకలాజికల్ ఇంటలిజెంట్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌క ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ య‌ల‌కంటి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈ సినిమాలో 'దీక్ష' అనే పాత్రలో లక్ష్మి న‌టించింద‌ట‌. అనుమానాస్పద పరిస్థితుల్లో మ‌ర‌ణించిన త‌న భర్త కేసు మిస్ట‌రీని ఛేదించే భార్య‌ పాత్ర‌ను పోషించిందట‌. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో ఆమెకు ఎటువంటి భయానక పరిస్థితులు ఎదుర‌య్యాయ‌నే నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కించార‌ట‌. ఇటీవ‌లే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ల‌భించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన సినిమా విడుదల చేసేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మంచు లక్షి కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయి అవుతుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంగా ఉంది.