Begin typing your search above and press return to search.

పవన్ పక్కన మంచు లక్ష్మి.. థ్రిల్ అయ్యానంటుంది..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 8:15 AM GMT
పవన్ పక్కన మంచు లక్ష్మి.. థ్రిల్ అయ్యానంటుంది..!
X
పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రమే టార్గెట్ చేసే వారు. కానీ పవన్ జనసేన పార్టీ స్థాపించి ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతున్న కారణంగా అతన్ని ఎవరు ఎక్కడ నుంచి టార్గెట్ చేస్తున్నారో అర్ధం అవ్వడం లేదు. పార్టీల పరంగా సిద్ధాంతాలు.. ఆచరణలు వేరు. సినిమాల పరంగా కమిట్ మెంట్ లు వేరు. కానీ సోషల్ మీడియాలో అవి రెండు కలిపి పవన్ పై ట్రోల్స్ చేయడం కామన్ అయ్యింది.

ఈ క్రమంలో లేటెస్ట్ గా పవన్ షేర్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫోటోని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఆ ఫోటోకి మంచు లక్ష్మి ఫోటో యాడ్ చేసి సినిమాలే రీమేక్ లు అనుకున్నాం ఇలా స్టిల్స్ కూడా కాపీ చేస్తున్నావా అని కామెంట్ పెడుతున్నారు.

దీనిపై మంచు లక్ష్మి కూడా స్పందించింది. మంచో చెడో కానీ తన ఫోటో పవన్ కళ్యాణ్ గారి పక్కన చూసి థ్రిల్ అయ్యానని కామెంట్ పెట్టింది. అయితే తన ఫోటో పెట్టిన వారికి సపోర్ట్ గా కూడా మంచు లక్ష్మి కామెంట్ పెట్టలేదు.

అయితే ఆ ట్రోల్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ ధీటుగా సమాధానం చెబుతున్నారు. పవన్ స్టిల్ మీద కూడా ఇలా కాపీ మరక అంటించడం మాత్రం ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుంది. పవన్ జనసేన ఎన్నికల్లో గెలిచి వీరందరికి సమాధానం చెప్పాలని జనసైనికులు కోరుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కాకుండా హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో పెట్టాడు.

ఈ సినిమాలన్ని కూడా వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి 2023 సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ టైం పాలిటిక్స్ లో బిజీ అవనున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ ప్రచారానికి ప్రత్యేక రథం కూడా ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏపీ మొత్తం తిరగాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.