Begin typing your search above and press return to search.
జడ్జ్ రోల్ తో కామెడీ ఎలాగబ్బా!!
By: Tupaki Desk | 11 July 2016 10:33 AM ISTకొన్ని సినిమాలకు కాన్సెప్టులు విచిత్రంగా అనిపిస్తాయి. స్టోరీ చెప్పినపుడే డిఫరెంట్ గా అనిపించడం వీటి స్పెషాలిటీ. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో చేయనున్న ఓ సినిమాపై ఇప్పుడు అలాంటి ఆసక్తి కలిగిస్తోంది. 'లక్ష్మీ బాంబు' అనే టైటిల్ పై మంచు లక్ష్మి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె జడ్జి పాత్రలో చేస్తున్నట్లు మందే చెప్పారు. ఇప్పుడీ చిత్రంపై మరో ఆసక్తి కరమైన విషయం ఒకటి బైటకొచ్చింది.
ఈ లక్ష్మీ బాంబును కామెడీ థ్రిల్లర్ గా తీయనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో జడ్జ్ పాత్రను పోషించేందుకు గాను మంచు లక్ష్మి చాలానే కసరత్తులు చేస్తోంది. న్యాయాధికారుల ప్రవర్తన హావభావాలను వాస్తవంగా చూపేందుకు అనేకమంది లాయర్లను జడ్జ్ లను కలుస్తోంది కూడా. ఇది లీగల్ సిస్టమ్ పై తీయనున్న చిత్రం కావడమే ఇందుకు కారణం. అయితే.. ఇలా న్యాయ వ్యవస్థపై తీసే సినిమాని కామెడీ థ్రిల్లర్ గా మలుస్తున్నాం అంటున్నాడు దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ.
అసలు లీగల్ సిస్టమ్.. టాలీవుడ్ కామెడీ.. ఈ రెండింటికీ ఎక్కడా పొంతన కుదరదు. కానీ ఈ రెండు జోనర్ లను మిక్స్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మరి మేకర్స్ ఈ రెండింటినీ ఎలా మిక్స్ చేస్తారో అనే విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం.. లక్ష్మీ బాంబు రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
