Begin typing your search above and press return to search.

నా బర్త్‌ డే కోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుంటా...!

By:  Tupaki Desk   |   10 July 2020 3:00 PM GMT
నా బర్త్‌ డే కోసం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుంటా...!
X
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా షూటింగులు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే హీరోలు దొరికిన సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయిస్తూ సరదాగా గడిపేస్తున్నారు. ఇటీవలే షూటింగ్స్ అనుమతి లభించడంతో సీరియల్స్ ఇతర షోల చిత్రీకరణ స్టార్ట్ చేసారు. ఇక మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇటీవలే ఓ టీవీ ప్రోగ్రామ్‌ ను స్టార్ట్ చేసింది. కరోనా లాక్‌ డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను మోటివేట్ చేయడానికి.. వారికి వివిధ అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ షో ప్రారంభించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌ ద్వారా హీరో దగ్గుబాటి రానా, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మరియు కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌ ను ఇంటర్వ్యూ చేసింది మంచు లక్ష్మి.

ఇటీవల దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించిన మంచు లక్ష్మి.. సేఫ్టీ మెజర్స్ తీసుకొని తక్కువ మందితో షూట్‌ చేయడం.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఉండటంతో షూట్‌ సరదాగా అనిపించలేదని చెప్పుకొచ్చిందట. ఇక రాబోయే అక్టోబర్‌ 8న తన బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి చెప్తూ బర్త్‌ డే కోసం గోవాలోని స్నేహితుల ఇంటికి వెళ్తానని.. ఒకవేళ అప్పుడు ట్రావెలింగ్ పై ఆంక్షలు విధిస్తే స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని.. అవసరమైతే కొంతమంది ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్తానని చెప్పిందట. ఎట్టిపరిస్థితుల్లో నా బర్త్‌ డే కోసం గోవా ప్రయాణాన్ని ఆపనని మంచు లక్ష్మి చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతోంది.